Articles & Opinion

We Were Here

 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ప్రియాంక చోప్రా

 ముంబయి ; ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నిర్మాతగా అవతారమెత్తారు. 11 నిమిషాల వ్యవధి గల ఒక లఘు చిత్రానికి ఆమె నిర్మాతగా వ్యవహరించారు. వి వర్ హియర్ అనే ఈ చిత్రం ఇప్పటికే 8‌0 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై 20కి పైగా అవార్డులు గెలుచుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎలా మానవ జీవితాలను ప్రభావితం చేస్తోందో తెలిపే ఇతివృత్తంతో ఈ లఘుచిత్రం నిర్మితమైంది.

యశ్ గోసాని, సతీశ్ కాశ్యప్, అరిందల్ బాగ్చీ, శుభమ్, కల్పన,దేవేంద్ర దడ్కే తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమై 99వ అకాడమీ అవార్డులకు క్వాలిఫై అయింది. ప్రణవ్ భాసిన్ రచించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి క్లెర్మోంట్ ఫెర్రాండ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కెనాల్ ప్లస్ అవార్డు లభించింది. ద న్యూయార్కర్ ఈ సినిమాను యూట్యూబ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *