Articles & Opinion

ఎన్ డిఎ లో చేరనున్న ఎన్ సిపి ? 

సుప్రియకు కేంద్రమంత్రి పదవి !

ముంబయి ; సీనియర్ నేత శరద్ పవార్ సారథ్యంలోని ఎన్ సిపి కూడా ఎన్ డిఎ లో చేరనున్నట్టు బలమైన వార్తలు వస్తున్నాయి. దేశంలో ఇటీవలి పరిణామాలతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పలుకుబడి నానాటికి దిగజారుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రోజురోజుకు బలపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఎలాగైనా కాంగ్రెస్ మిత్రపక్షాల్లో చీలిక తేవడానికి బిజెపి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పవార్ నాయకత్వంలోని ఎన్ సిపిని కూడా ఎన్ డిఎలో చేర్చుకోనున్నట్టు తెలిసింది. ఈమేరకు పవార్ తో మంతనాలు పూర్తయ్యాయని విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. 

   ఇదివరకే అజిత్ పవార్ సాయంతో ఎన్  సిపిని చీల్చి మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ లో భాగస్వామిగా చేర్చుకుంది. అంతకుముందే శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండేకు అండగా నిలిచింది. ఈసారి రాష్ట్రంలో సొంతగా అధికారంలోకి వచ్చి షిండేకు, అజిత్ పవార్ కు ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టింది. అయితే కొంతకాలం కిందట బారామతిలో జరిగిన ఆకస్మిక విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంతో వెంటనే ఆయన భార్య సునేత్ర పవార్ కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. 

   ఇక రాష్ట్రంలో మిగిలిన శరద్ పవార్ కు చెందిన ఎన్ సిపిని కూడా ఎన్ డిఎ లో కలుపుకోవాలని అప్పటినుండి యత్నిస్తోంది. ఇందుకు అటు శరద్ పవార్ ను, ఇటు సునేత్రను ఒప్పించాల్సి ఉంది. 

 సునేత్ర కుమారుడు పార్థ పవార్ వ్యవహార శైలిపై  అసంతృప్తిగా ఉన్న ఎన్ సిపి (అజిత్) నాయకులు ఇటీవల ఢిల్లీలో నేరుగా కేంద్రహోంమంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. వారే ఢిల్లీ వెళ్లారా లేక షా యే పిలిపించుకున్నారో తెలియకున్నా రెండు వర్గాలు మళ్లీ కలసిపోవడం, అంతా ఎన్ డి ఎలో చేరడం అనివార్యం అనే సందేశాన్ని బిజెపి పంపింది. అంతేకాక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్ కు ప్రధాని మోడీ ఫోన్ చేసి పరామర్శించారు. పనిలో పనిగా సుప్రియా సూలే భవితవ్యం గురించి చింతించవద్దని, ఆమె బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. అంటే ఎన్ డిఎ లో చేరితే ఆమెకు కేంద్రంలో మంత్రిపదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. మూడురోజుల పాటు ముంబయి బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఉన్నశరద్ పవార్ శనివారం నాడు డిశ్చార్జి అయ్యారు. దీంతో ఎన్ సిపి బిజెపి సారథ్యంలోని ఎన్ డి ఎ లో చేరే కార్యక్రమం ఊపందుకుంటుందని భావిస్తున్నారు.   

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *