Articles & Opinion

 UPI payments OK  SINGAPUR, DUBAI

  బుర్జ్ ఖలీఫా, సింగపూర్ లలో కూడా యుపిఐ చెల్లింపులు ఓకే

 న్యూఢిల్లీ ; యుపిఐ ద్వారానే భారతీయులు బుర్జ్ ఖలీఫా, సింగపూర్ లలోని యూనివర్సల్ స్టూడియో తదితర దర్శనీయ ప్రదేశాల్లో టికెట్లు అడ్వాన్స్ గా బుక్ చేసుకోవచ్చునని కేంద్రఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదంతో యుఏఇ, సింగపూర్ లలోని సంస్థలతో ఒక ఒప్పందం   కుదుర్చుకున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపిఎల్) తెలిపింది. దీనివల్ల భారతీయ పర్యాటకులకు ఎంతో సౌకర్యం కలుగుతుంది. అరబ్ ఎమిరేట్స్ లో నియోపేతో గత జూలైలో, సింగపూర్ లోని ఫోమోపేతో సెప్టెంబర్ లో ఎన్ పిసిఐఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో యుపి ఐ చెల్లింపులకు మార్గం సుగమమైంది.

 ప్రతి ఏటా దుబాయి లోని బుర్జ్ ఖలీఫా, సింగపూర్ లోని నేషనల్ ఓషనేరియం, యూనివర్సల్ స్టూడియో, అడ్వెంచర్ వాటర్ పార్క్ లను ఎందరో భారతీయులు సందర్శిస్తున్నారు. అక్కడ బుకింగ్స్ కోసం ఇతర చెల్లింపుల కోసం వారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పడు తొలగిపోనున్నాయి. గత ఏడాది సింగపూర్ ను 12 లక్షల మంది భారతీయులు సందర్శించారు. 

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *