రాహుల్ ప్రధాని కాలేడు ; అమిత్ షా
న్యూఢిల్లీ ; కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రధాని ఎన్నటికీ కాలేరని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇండియా కూటమి వారు శనివారం నిర్వహించుకున్నట్టు మాక్ పార్లమెంట్ సమావేశాలు మాత్రమే నిర్వహించుకుంటూ ఉండాలని ఆయన విమర్శించారు. ఆదివారం చండీగఢ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాక్ పార్లమెంట్ లో మాత్రమే రాహుల్ ప్రధానిగా కలలు కంటూ ఉండాలని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ ఎన్నటికీ ప్రధాని కాలేడన్నారు. ప్రతి పక్షాలు తలపెట్టిన మార్చ్ ను ఆయన తప్పుపట్టారు. కాగా, కాంగ్రెస్, ప్రతిపక్షాల బ్రహ్మాండమైన ర్యాలీకి పోటీగా బిజెపి నేతలు కూడా పలు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ర్యాలీలు నిర్వహించారు. హర్యానాలోని ఫరీదాబాద్ ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ‘ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి…అరాచకాన్ని అంతంచేయండి ’ అనే నినాదంతో బిజెపి దేశవ్యాప్తంగా ఈ ర్యాలీలను నిర్వహించింది. ఫరీదాబాద్ ర్యాలీలో కేంద్రమంత్రులు కృషన్ పాల్ గుర్జార్, రాజేశ్ నాగర్, హర్యానామంత్రి గౌరవ్ గౌతమ్ తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితర నేతలు కూడా ప్రతిపక్షాల చేష్టలన్నీ పెద్ద డ్రామాలని విమర్శించారు. ఎన్నికల జాబితాలో అవకతవకలేవీ జరగలేదన్నారు. చనిపోయినవారివి, వలసవెళ్లినవారివి మాత్రమే తొలగించారని వారు వివరించారు.

Leave a Reply