Andhra Pradesh

       Only GREEN CRACKERS

  • SC ORDER.
  • దీపావళి నాడు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలి.
  • నాసిరకం కాల్చినా, అమ్మినా కఠిన చర్యలు ; సుప్రీం

న్యూఢిల్లీ ; దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చరాదని, ఒకవేళ కాల్చినా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం దృష్య్ట్యా దీపావళి టపాసులను నిషేధించాలని దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పండుగలు జరుపుకోవడమంటే పర్యావరణాన్ని బలిపెట్టడం కాకూడదని తెలిపింది. తమ ఆనందంకోసం ఇతరుల ఆరోగ్యాలతో చెలగాటమాడవద్దని హెచ్చరించింది. దీపావళి ఆనందోత్సాహాల వేడుక అని తమకు తెలుసని, అయితే దాన్ని ఇతరుల బాగోగులను, ఇబ్బందులను, వాతావరణ కాలుష్యాన్ని పట్టించుకోకుండా జరుపుకోరాదని పేర్కొంది. దేశరాజధానిలో దీపావళి పండుగ జరిగే ఏడు, ఎనిమిది తేదీలలో ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది వరకు, సాయంత్రం ఏడు నుండి పది గంటలవరకే టపాకాలయాలు కాల్చాలని, అవి కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడాలని సూచించింది.  9న పూర్తిగా క్రాకర్స్ నిషిధ్ధమని కోర్టు తెలిపింది. గ్రీన్ క్రాకర్స్ అవి కూడా సిఎస్ఐఆర్, నీరి ఆమోదం ఉన్న వాటినే వ్యాపారులు విక్రయించేలా అధికారులు, పోలీసుశాఖ చూడాలని, మిగతా కల్తీసరుకులను, చట్టవిరుద్ధంగా తయారైనవాటిని అమ్మకుండా చూడాలని, ఒకవేళ అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.

అంతేకాక, ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్ లు, వృద్ధాశ్రమాలు, విద్యాసంస్థలకు 300 మీటర్ల  దూరం ఉండేలా టపాకాయలు కాల్చాలని సూచించింది. వీటిని ఎవరు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పండుగ కు ముందు రోజు, ఆతర్వాత కూడా వాయుకాలుష్యాన్ని నమోదు చేయాలని, జల, భూ కాలుష్యాన్ని కూడా గుర్తించేందుకు శాంపిల్స్ సేకరించాలని కాలుష్య నియంత్రణ మండలిని సూచించింది.ఆస్పత్రుల్లో ఎందరు చేరారో నమోదు చేయాలని ,  ఈ వివరాలను అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని వచ్చేనెల 14 నాడు మళ్లీ విచారిస్తామని కోర్టు  పేర్కొంది. నాణ్యత లేని సరుకులను వెంటనే సీజ్ చేయాలని కూడా అధికారయంత్రాంగాన్ని ఆదేశించింది. ఈమేరకు కేంద్రకాలుష్య నియంత్రణ మండలికి, రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ళకు ఆదేశాలు జారీ చేసింది.

దీపావళిని ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకునే సంప్రదాయాలను గౌరవించాల్సిందేనని, అయితే పర్యావరణం దెబ్బతినకుండా, ఇతరుల ఆరోగ్యానికి ముప్పువాటిల్లకుండా జరుపుకోవాలంది. స్కాంధపురాణంలో, పద్మపురాణంలో కూడా దీపావళి రోజున దీపాలు వెలిగించాలని మాత్రమే ఉందని, కాలక్రమేణా మందుగుండు వాడడం ఆరంభమై అదే అలవాటుగా మారిపోయిందని కోర్టు వ్యాఖ్యానించింది.

 ఇదిలా  ఉండగా, ఈ సుప్రీంకోర్టు తీర్పును పలువురు హర్షిస్తున్నారు. అయితే ఇది కేవలం దేశరాజధాని ఢిల్లీకే వర్తింపచేయకుండా దేశమంతటా ఇవే ఆదేశాలు వర్తించేలా జారీ చేస్తే బాగుండేదంటున్నారు. అంతటా ఇదే ఆర్భాటాలతో దీపావళి క్రాకర్స్ కాలుస్తూ పర్యావరణానికి తీవ్ర నష్టం, ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్నారని పలువురు గుర్తు చేస్తున్నారు.  

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *