India

     చెన్నయిలో ‘ సుప్రీం’ బెంచ్ 

  • – ప్రధానికి సిఎం విజయ్ లేఖ 

 చెన్నయి ; తమిళనాడు రాజధాని చెన్నయిలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రధాని నరేంద్రమోడీని కోరారు. ఈమేరకు గురువారం నాడు ఆయన ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. చెన్నయిలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనేది నాలుగున్నర దశబ్దాల కోరిక అని ఆయన గుర్తు చేశారు. 1980 లో ఈ మేరకు విజ్ఞప్తులు చేశారని, అప్పటినుండి ఎన్నోమార్లు ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని, లాకమిషన్ కూడా ఈమేరకు సిఫారసులు చేసిందని సిఎం విజయ్ లేఖలో వివరించారు. రాజ్యాంగంలోని 13‌0 వ అధికరణం అందరికీ న్యాయం అందాలని చెబుతోందని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎక్కడ కూర్చున్నా ఒకటేనని పేర్కొంటోందని విజయ్ వివరించారు. అలాగే రాజ్యాంగంలోని 32వ అధికరణం సామాన్యులకు, సంపన్నులకు న్యాయం అందుబాటులో ఉండాలంటోందన్నారు. చెన్నయిలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. 

చెన్నయి నగరం దక్షిణాదిలోనే గాక దేశంలోనే ప్రధాన నగరాల్లో ఒకటని, ఇరుగుపొరుగు రాష్ట్రాల వారికి కోర్టుకు రావడానికి అనువుగా ఉంటుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల వారు ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే ఎన్నోవ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తోందని, పేదలకైతే మరీ భారంగా పరిణమించిందని సిఎం విజయ్ తన లేఖలో తెలిపారు.  

 పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు కూడా 204, 2006, 2008, 2021లో సుప్రీంకోర్టు బెంచ్ చెన్నయిలో ఏర్పాటు చేయడం గురించి సానుకూలంగా స్పందించాయని , చెన్నయిలో ఏర్పాటు చేస్తే దేశ సమాఖ్య స్ఫూర్తిని గౌరవించినట్టవుతుందన్నారు. అందుకే మరోసారి తాజాగా ఆలోచించి సుప్రీం కోర్టు బెంచ్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజయ్ కోరారు. 

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *