దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్‘ నవంబర్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుండగా, ‘హైవాన్‘, ‘దిల్వాలీ దీపావళి‘, ‘బస్ మచినా‘వంటి ఇతర కొత్త విడుదలలు పోటీ పడుతున్నాయి. బ్లాక్ డోవ్స్, ది ఇన్స్టిట్యూట్, అండర్ సీజ్ వంటి మరిన్ని షోలు తిరిగి వస్తున్నాయి.
ప్రైమ్ వీడియో, సోనీలివ్, జీ5 లలో కూడా కొన్ని ముఖ్యమైన చేర్పులు ఉన్నాయి వాటిలో మహమ్మద్ అలీ జీవిత చరిత్రతో సిరీస్, ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక తమిళ రొమాంటిక్ డ్రామా కూడా ఉన్నాయి. థ్రిల్లర్, డాక్యుమెంటరీ లేదా కుటుంబంతో కలిసి చూడడానికి ఏదైనా సినిమా లేదా షో లతో కూడిన తాజా వాచ్‌లిస్ట్ ఈ కింద చూడండి…
1. ఐయామ్ గేమ్
నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్‘లో దుల్కర్ సల్మాన్ డాన్ జాన్ పాత్రలో నటించారు. అదృష్టంపై తనకున్న నమ్మకంతో పదేపదే ప్రమాదకర పరిస్థితుల్లోకి చిక్కుకునే ఒక నిర్భయ జూదరి కథే ఈ మూవీ. తను తీసుకునే నిర్ణయాలు తనని మరింత ఇబ్బందుల్లోకి నెట్టడంతో, రిస్క్‌తో కూడిన, అవకాశం చుట్టూ అల్లుకున్న జీవితపు పరిణామాల్ని డాన్ ఎదుర్కోవలసి వస్తుంది. నవంబర్ 6, 2026, జియోహాట్‌స్టార్.
2. మీసయ మురుక్కు 2
2017 తమిళ మ్యూజికల్ కామెడీ ‘మీసయ మురుక్కు‘కి సీక్వెల్‌తో ‘హిప్హాప్ తమిళ ఆది’ ఆ ప్రపంచంలోకి తిరిగి వస్తోంది. ఈసారి, ఒక శక్తివంతమైన సినీ నిర్మాత కుమారుడు లైలాపై ఆసక్తి చూపడంతో, సంగీతకారుడు కావాలని ఆశపడే జీవాకి, ఆమెతో తన సంబంధం ఒత్తిడికి గురవుతుంది. నవంబర్ 6, 2026, సోనీలివ్.
3. నూరు కోడి వానవిల్
చాలా కాలం నిరీక్షణ తర్వాత, ‘నూరు కోడి వానవిల్‘ ఎట్టకేలకు డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. శశి దర్శకత్వం వహించిన ఈ తమిళ రొమాంటిక్ డ్రామాలో హరీష్ కళ్యాణ్, సిద్ధి ఇడ్నాని యువ జంటగా నటించారు. కుటుంబ అంచనాలతో బాటు రోజువారీ పరిస్థితుల కారణంగా వారి బంధం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. నవంబర్ 6, 2026, జీ5.
4. హైవాన్
సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన హిందీ థ్రిల్లర్ ‘హైవాన్‘తో ప్రియదర్శన్ తిరిగి వస్తున్నారు . 2016 మలయాళ మూవీ ‘ఒప్పం‘కు అధికారిక రీమేక్ అయిన ఈ మూవీలో, ఒక అంధుడైన సంరక్షకుడు ఒక శవాన్ని చూసి, ఆ హత్య కేసు దర్యాప్తులో ప్రధాన అనుమానితుడిగా మారతాడు. నవంబర్ 6, 2026, సోనీలివ్.
5. దిల్వాలీ దీపావళి
రితేష్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా, దీపాల పండుగ కోసం ఇంటికి తిరిగి వచ్చిన ఒక యువకుడి (మిహిర్ అహుజా పోషించిన పాత్ర) కథని అనుసరిస్తుంది. ఏ ఇతర భారతీయ కుటుంబంలాగే, ఇక్కడ కూడా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయి. టెరిబ్లీ టైనీ టేల్స్ నిర్మించిన ఈ షోలో మనోజ్ పహ్వా, నీలూ కోహ్లీ కూడా నటించారు. నవంబర్ 5, 2026, నెట్‌ఫ్లిక్స్.
6. బాస్ మచినా
పెద్దల కోసం రూపొందించిన ఈ యానిమేటెడ్ స్టీమ్పంక్ వెస్ట్రన్ ‘ బాస్ మచినా‘కు బ్రియన్ టైరీ హెన్రీ, టాటి గాబ్రియెల్, జానెల్ మొనే ప్రధాన గాత్రాలను అందించారు . అలౌకిక శక్తులు, అదుపులేని సాంకేతికాలతో ఢీకొనే ఈ చట్టరహిత సరిహద్దు ప్రాంతంలో, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ న్యాయమూర్తి, జ్యూరీ, మరణశిక్ష అమలు చేసేవాడి పాత్రలని పోషించే ఒక వృద్ధ గన్స్లింగర్ కథను ఈ ఆరు-ఎపిసోడ్ల పరిమిత సిరీస్ అనుసరిస్తుంది. నవంబర్ 3, 2026, ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
7. ఏ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్
‘ఏ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్‘తో పండుగ సీజన్ ముందుగానే ప్రారంభమవుతోంది. . డబ్ల్యూ. బ్రూస్ కామెరాన్ రాసిన ఒక ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందిన ఈ కథ, ఒక కుటుంబంలో పండుగ వేడుకలు గందరగోళంగా మారడం మొదలైనప్పుడు, తెలివైన ఒక వీధి కుక్కపిల్ల వారి బంధువుల్ని ఒకచోట చేర్చి, వారి మధ్య ఉన్న విభేదాలని పరిష్కరించుకోవడానికి ఒక కారణాన్ని ఇవ్వడం చుట్టూ తిరుగుతుంది. నవంబర్ 4, 2026, నెట్‌ఫ్లిక్స్
8. టేకెన్ : నటాలీ హోలోవే
2005లో గ్రాడ్యుయేషన్ ట్రిప్‌లో భాగంగా అరుబాకు వెళ్లిన అమెరికన్ విద్యార్థిని నటాలీ హోలోవే దృశ్యం కావడం, గత రెండు దశాబ్దాలలో అత్యంత విస్తృతంగా చర్చించిన అదృశ్య వ్యక్తుల కేసులలో ఒకటిగా మిగిలిపోయింది. డానీ స్లోన్, మాథ్యూ గాల్కిన్ లు దర్శకత్వం వహించిన మూడు భాగాల డాక్యుమెంటరీ సిరీస్ ‘టేకెన్: నటాలీ హోలోవే‘ ఈ కేసుని తిరిగి పరిశీలిస్తుంది. ఇంతకు ముందెన్నడూ చూడని ఆర్కైవల్ ఫుటేజ్, ప్రాథమిక గాలింపులో పాల్గొన్న దర్యాప్తు అధికారులతో సంభాషించిన వివరాలతో, ఈ సిరీస్ హోలోవే అదృశ్యం చుట్టూ జరిగిన సంఘటనల్ని, అంతర్జాతీయ సరిహద్దుల్ని దాటి న్యాయం కోసం ఆమె కుటుంబం చేసిన సుదీర్ఘ ప్రయత్నాలని వివరిస్తుంది. నవంబర్ 4, 2026, నెట్‌ఫ్లిక్స్.
9.ది గ్రేటెస్ట్
మహమ్మద్ అలీ వారసత్వం బాక్సింగ్ రింగ్‌కి ఆవల విస్తరించింది..‘ది గ్రేటెస్ట్‘ అతడి జీవితంలోని అనేక కోణాల్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తుంది. ఈ జీవితచరిత్ర సిరీస్, హెవీవెయిట్ ర్యాంకులలో అతడి ఎదుగుదలని అనుసరిస్తూనే, అతడి రాజకీయ క్రియాశీలత్వం, మత మార్పిడి, చివరికి ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి బహిష్కరణని కూడా పరిశీలిస్తుంది. నవంబర్ 4, 2026, ప్రైమ్ వీడియో.
10. బ్లాక్ డోవ్స్ సీజన్ 2
బ్లాక్ డోవ్స్ రెండవ సీజన్లో హెలెన్ వెబ్ (కీరా నైట్లీ), సామ్ యంగ్ (బెన్ విష్షా) లు మరో విడత గూఢచర్యం కోసం, రాజకీయ కుట్రల కోసం తిరిగి వస్తున్నారు . ఒక హంతకురాలిగా హెలెన్ ద్వంద్వ జీవితాన్ని దాచడం ఇప్పటికీ కష్టంగానే ఉంది, ముఖ్యంగా ఈ కొత్త సీజన్లో ఆమె భర్త బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి అయ్యేందుకు దగ్గరవుతున్న తరుణంలో. నవంబర్ 5, 2026, నెట్‌ఫ్లిక్స్.
11. పాసిబుల్ లవ్
దక్షిణ కొరియా చిత్రనిర్మాత లీ చాంగ్-డాంగ్ ఎనిమిదేళ్ల తర్వాత తన మొదటి కొత్త ఫీచర్ ‘పాసిబుల్ లవ్‘తో తిరిగి వస్తున్నారు. ఈ డ్రామాలో ఉద్యోగం కోల్పోయిన ఒక ఉద్యోగి, అతడి భార్య, అలాగే ఒక డాక్యుమెంటరీ చిత్రనిర్మాత, ఆమె భర్త అనే రెండు వివాహిత జంటలు కలుస్తాయి. ఒక సినిమా ప్రాజెక్ట్ ద్వారా వారి జీవితాలు ముడిపడతాయి, ఇది వారి సంబంధాలు, వ్యక్తిగత ఆశయాలు, వ్యక్తపరచని కోరికల్ని నిశితంగా పరిశీలించడానికి వేదికని సిద్ధం చేస్తుంది. నవంబర్ 6, 2026, నెట్‌ఫ్లిక్స్
12. ది ఇన్స్టిట్యూట్ సీజన్ 2
స్టీఫెన్ కింగ్ నవల ఆధారంగా, ‘ది ఇన్స్టిట్యూట్‘ రెండవ సీజన్‌తో తిరిగి వస్తోంది. ఒక రహస్య సంస్థలో బందీలుగా ఉన్న అతీంద్రియ శక్తులు గల పిల్లల కథ ఇందులో కొనసాగుతుంది. ఆల్ఫీ అలెన్ పోషించిన నోలన్ రీవ్స్ పాత్రతో ఈ కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. సంస్థకి చెందిన మిగిలిన సౌకర్యాలను కూల్చివేయడానికి జరిగే పోరాటం తీవ్రమవుతుంది. నవంబర్ 8, 2026 ఎంజిఎం ప్లస్ ప్రైమ్ వీడియో .

Leave a Reply