India

Omar Abdulla weds NIDHI

జర్నలిస్ట్ నిధితో

కశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా వివాహం

 శ్రీనగర్ ; జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వివాహం ప్రముఖ జర్నలిస్ట్ నిధి రాజ్దాన్ తో శనివారం నాడిక్కడ చాలా నిరాడంబరంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రెండుకుటుంబాల పెద్దలు, కొందరు ముఖ్యులు మాత్రమే హాజరయ్యారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, తల్లి మోలీ అబ్దుల్లా, నిధి తల్లిదండ్రులు ఎం.కె.రాజ్దాన్, సరళా రాజ్దాన్ తదితరులు ఈ వివాహవేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ఒమర్ వయసు 56 సంవత్సరాలు కాగా, నిధికి 49 ఏళ్లు.

 ఒమర్ అబ్దుల్లాకు గతంలో పాయల్ తో పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. వారిద్దరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనేక కోర్టుల్లో చాలా కాలంగా వ్యాజ్యాలు సాగి గత జూలైలో పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. తమకు విడాకులు మంజూరు చేయాలని ఇద్దరు సంయుక్తంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. దీంతో ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది.

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating