అసలు ఈ మధ్య యూత్ సినిమా అంటేనే “A” సర్టిఫికెట్ తో రిలీజ్ కి రావడం పరిపాటి అయిపోయింది. దాన్ని బ్రేక్ చేస్తూ “A” అనే “మరక”లేకుండా “U/A” తో “తెల్లకాగితం” బయటకి రావడం నిజంగా అభినందనీయమే. ఫ్యామిలీ తో సినిమాకి వెళ్లాలనుకునవాళ్ళు బుక్ మై షో లో A సర్టిఫికెట్ చూసి చాలా మంది ఆగిపోతున్నారు. ఆ బాధ లేకుండా ఈ సినిమా “U/A” సర్టిఫికెట్ సంపాదించుకుంది అంటే ఎంతో కొంత ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైనట్టే. బెస్ట్ విషెస్ టు తెల్లకాగితం టీం ఫ్రమ్ తూటా..!!
Thella Kaagitham Movie Recieves U/A Certificate: మరక లేకుండా బయటపడ్డ తెల్లకాగితం