Articles & Opinion

Sukumar’s Failure Students Story – పరమానందయ్య శిష్యులకు శిక్షణ అవసరం

గురువు సుకుమార్ తీసుకున్న “పుష్ప” లో గుర్తింపు అనే పాయింట్ నే ఆయన ఇద్దరు శిష్యులు మళ్ళీ తీసుకున్నారు. బుచ్చిబాబు “పెద్ది” లో, శ్రీకాంత్ ఓదెల “ది పారడైస్” లో తీసుకున్నారు. గురువు డైరెక్షన్ లో ప్రతి సీన్ లోను కంటెంట్, ఎమోషన్ రెండూ ఉంటాయి. అణువణువునా నావల్టీనెస్ కనిపిస్తుంది. అందునా ఆయన తెలుగు సినిమాకు క్రియేటివ్ కమర్షియల్ లెక్కల పరమానందయ్య. అయన లెక్కలు ప్రేక్షకుడికి అర్ధమయ్యేరితిలో ఉంటాయి. శిష్యుల లెక్కలు మాత్రం ప్రోడ్యూసర్ల జేబులని ఖాళీ చేయించే విచిత్రమైన హైప్ తో ప్రేక్షకులకు విసుగుని, డిస్ట్రిబ్ర్యూటర్ లకు ఏడుపులను మిగిల్చాయి. ఈ శిష్యదర్శకులు ఇద్దరూ మరికొన్ని రోజులు సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్లుగా వర్క్ చేస్తే గురువు లెక్కలో కొన్నిఅయినా అర్ధం అవుతాయి.

మరి ముందు తీసిన సినిమాలు హిట్ అయ్యాయి కదా అంటే, పరమానందయ్య శిష్యులు తెలియకుండా చేసే కొన్ని పనులు తప్పయినా సరే అదృష్టం కలసివచ్చి ఫైనల్ గా సక్సెస్ గా మిగులుతూ ఉంటాయి. అలా జరిగిన సంఘటనలే ‘ఉప్పెన’, ‘దసరా’.

కాబట్టి పరమానందయ్య శిష్యులకు మరికొన్ని రోజులు శిక్షణ అవసరం.  

నిర్మాతలూ బహుపరాక్ సుమా….!

Rate this article

How useful or interesting did you find this story?

4.8/5 5 ratings