Andhra Pradesh

Rayalaseema Horticulture Hub 1Lakh Crore Investmentరాయలసీమ హార్టీకల్చరల్ హబ్ కు

 రిలయన్స్ లక్షకోట్లు !

  • శంకుస్థాపన రోజు అనంత్ అంబానీ వెల్లడి

 మదనపల్లి ; చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఏర్పాటు చేస్తున్న రాయలసీమ హార్టికల్చరల్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కోసం రూ. లక్షకోట్లు కేటాయిస్తున్నట్లు రిలయన్స్  ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రకటించారు. శుక్రవారం (అక్టోబర్ 2) రాయలసీమ హార్టికల్చరల్ హబ్, ఐఎస్ఎ  శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కేంద్రాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ల తో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ లక్ష కోట్లను రైతుల అభ్యుదయానికి వినియోగించనున్నట్లు అంబానీ తెలిపారు. రాయలసీమ రైతులకు వ్యవసాయరంగంలో సాంకేతిక విషయాల వినియోగంలో తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలసి వ్యవసాయదారుల అభ్యున్నతికి పాటుపడతామని అనంత్ చెప్పారు.

Rate this article

How useful or interesting did you find this story?

3.0/5 1 rating