Latest News

Raviteja’s THULABHARAM

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టి ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా కోసం ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేసే డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రవితేజ చేతులు కలపడం సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమాకు ‘తులాభారం’ అనే వెరైటీ టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తోందన్న వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ టాక్ నెట్టింట వైరలవుతోంది. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి విలన్‌గా నటిస్తున్నారని లేటేస్ట్ టాక్.

గతంలో రవితేజ, జేడీ చక్రవర్తి చివరిసారిగా 2007లో వచ్చిన ‘దుబాయ్ శీను’లో కలిసి నటించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. దసరా సందర్భంగా సినిమాను అధికారికంగా లాంఛ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating