Articles & Opinion

No Alteration Of My Photos మార్ఫింగ్ ఫోటోలు వాడకండి ; యామి గౌతమ్

ఒరిజినల్ ఫొటోలే వాడాలని డీప్ ఫేక్ ఫోటోలు ఉపయోగించవద్దని ప్రముఖ బాలీవుడ్ నటి యామి గౌతమ్ విజ్ఞప్తి చేశారు.ఎఐ జనరేటేడ్ ఫోటోలు వాడి నటీ నటులను మనస్తాపానికి గురి చేయవద్దని ఆమె కోరారు. ప్రముఖ నటి సమంత విషయంలో జరిగిన దుష్ప్రచారాన్నిఆమె గుర్తు చేశారు.సమంత కేసులో ముంబై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమె ఉటంకిస్తూ నటుల విషయంలో జాగ్రత్తగ ఉండాలని యామి సోషల్ మీడియాకు హితవు పలికారు.ఈమేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. తారల సొంత ఫోటోలు ,సహజ సిద్దమైన ఫొటోలే ఉపయోగించాలని యామి గౌతమ్ కోరారు .
ఇటివలి కాలంలో “దేవర” మూవీ లోని పాటను వక్రీకరించడంతో ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్టం చేసిన సంగతి తెలిసిందే .దీనిని మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ఇలా జరుగుతుంటే తాము సైలెంట్ గా ఉండబోమని ఆయన అన్నారు. సోషల్ మీడియాను ఇలా దుర్వినియోగపరిచడం మంచిది కాదన్నారు.

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating