ది ప్యారడైజ్….. ఎవరు అవునన్నా కాదన్నా నాని రేంజ్ ని పెంచిన సినిమా ఇది. కానీ సినిమా లో కథతో సహా అన్ని విభాగాలు యే మాత్రం బాగుండి ఉన్నా నాని రేంజ్ మరోలా ఉండేది. 224 రోజులు షూటింగ్ చేసినా… “జరుగుతున్న తప్పును గుర్తించలేకపోవడం 32 సినిమాల అనుభవం ఉన్న నాని తప్పిదం”.
“నిర్మాత”కి ఉన్న అనుభవం కంటే “హీరో” కి ఉన్న “అనుభవం ఎక్కువైనప్పుడు” దాన్ని గుర్తించాల్సిన బాధ్యత హీరోది. కానీ ఆ బాధ్యతని నిర్వర్తించడం లో నాని విఫలమయ్యాడు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో అందరి కళ్ళు ఒక్కచోటే ఆగిపోయాయి. రెప్ప వాల్చకుండా ఆయన వైపే చూశాయి. ఎవరి వైపో తెలుసా..? నిర్మాత చెరుకూరి సుధాకర్ వైపు.
ఆయన మైక్ తీసుకోగానే ప్యారడైజ్ సినిమా కి ఆయన పడ్డ కష్టం, భరించిన భారం, పడిన ఆనందం, వస్తున్న కలెక్షన్ లు మరేదీ ఆయన పెదవి దాటి బయటకి రాలేదు. అన్ని ఆయన కళ్ళల్లోనే ఆగిపోయాయి. అందుకే మనందరి కళ్ళు ఆయన వైపే చూస్తూ ఆగిపోయాయి.
“224 రోజుల షూటింగ్” కి విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టి “హీరో స్థాయి”ని పెంచడానికి తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా, చెప్పిన మాటలు దాటి, లెక్కలు దాటి, కోటలు దాటి, “బడ్జెట్” వెళ్లినా ఎవ్వరికీ చెప్పకుండా అన్నీ తానే భరిస్తూ, చిరు దరహాసంతో, పట్టుదలతో సినిమా ని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇది సామాన్యుడి వల్ల జరగదు. అది ఆయన చేయగలిగారంటే యే రేంజ్లో కమిట్మెంట్, నిబద్ధత ఆయనకి ఉన్నాయో అర్ధం అవుతోంది. ఇదంతా ఆయన మొహం లో కనిపించింది.
ఇలాంటి బాధ్యత ఉన్న నిర్మాతలు దొరకడం అరుదు. కొందరు నిర్మాతలు సాధించింది తక్కువైనా కాలర్ ఎగరేసి మైక్ లు విసిరేయడం ఎన్నో ప్రెస్ మీటుల్లో చూసాం. సినిమా రిలీజ్ అయి ఫెయిల్ అయ్యాక ప్రెస్ మీట్లో దర్శకుడి పక్కన కూర్చొని ఇది ఫెయిల్ అవుతందని ముందే చెప్పనా అని దర్శకుల మీద తప్పులేసిన నిర్మాతలని చూసాం. అలా ఏమీ మాట్లాడకుండా కళ్ళల్లోనే తన భావాలని చెప్పి ప్రెస్ మీట్ ని ముగించిన చెరుకూరి సుధాకర్ అభినందనీయుడు.
కాబట్టి ఎన్నెన్నో మంచి సినిమాలు ఆయన చెంతకు చేరి విజయ గర్వంతో ఆ సినిమాలు బయటకి రావాలని ఆయన పది కాలాలు సంతోషంగా ఉంటూ అనేక మంది సినీ కార్మికులకు పని కల్పిస్తూ అగ్ర నిర్మాతగా ఎదగాలని కోరుకుంటుంది తూటా..!!
హాట్స్ ఆఫ్ టూ చెరుకూరి గారు..!!
