- అజయ్ దేవగణ్ దృశ్యం- 3
- పఠాన్,యానిమల్, దురంధర్ లను క్రాస్ చేసిన కలెక్షన్స్ ..
ముంబయి ; విడుదలైన తొలిరోజే కలెక్షన్ల కనకవర్షం కురిపించిన సినిమాలకు టాలీవుడ్ లోనైనా, బాలీవుడ్ లో నైనా ఎప్పటికీ క్రేజే. అజయ్ దేవగణ్ నటించిన దృశ్యం -3 సినిమా మొదటిరోజే రూ.67 కోట్లు వసూళ్ళతో సంచలనం సృష్టించింది. ఇది దురంధర్, యానిమల్, పఠాన్ ల రికార్డును తిరగరాసింది.శుక్రవారం (అక్టోబర్ 2) నాడు విడుదలైన దృశ్యం-3 కి మంచి పబ్లిసిటీతో థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తారు. ఇదివరకే దృశ్యం 1,2 లు విడుదలై బాగా పేరుతెచ్చుకున్న సంగతి తెలిసింది. దృశ్యం సిరీస్ లో ఇది చివరిది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ తోపాటు శ్రియాశరణ్, టబు,ఇషితా దత్తా, ప్రకాశ్ రాజ్ ,రజత్ కపూర్, కమలేశ్ సావంత్, మృణాళ్ జాధవ్, సౌరభ్ శుక్లా, జయదీప్ అహ్లావత్ తదితరులు నటించారు.ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు.
ఇటీవల పెనుసంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ ‘దురంధర్’ సినిమా తొలిరోజు 30 కోట్లు, షారుఖ్ ఖాన్ చిత్రం ‘ పఠాన్’ రూ.57 కోట్లు, రణబీర్ కపూర్ ‘ యానిమల్ ’ రూ 63 కోట్లే వసూలు చేయగా, అజయ్ దేవగణ్ ‘ దృశ్యం-3’ తొలిరొజు 66.61 కోట్లు వసూలు చేసింది. విడుదలకు ఐదురోజుల ముందు సెప్టెంబర్ 27న అడ్వాన్స్ బుకింగ్ లు ఓపెన్ కాగా రూ.50 కోట్లు వచ్చాయి. మిగిలిన 17 కోట్లు రిలీజైన రోజు వచ్చాయి.
…………………………..
