Articles & Opinion

Javed Akhtar apologizes to Rashmika

రష్మిక కు జావేద్ అఖ్తర్ క్షమాపణలు

 ముంబయి ;  ప్రముఖ నటి రష్మిక మందన్నాకు హిందీ గీత రచయిత జావేద్ అఖ్తర్ క్షమాపణలు తెలిపారు. తాను ఆమెను తమిళ నటి అని సంబోధించాల్సింది కాదన్నారు.

 ‘‘ కాఫీ విత్ కరణ్ ’’ కార్యక్రమంలో రష్మిక మందన్నా తన భర్త సినీనటుడు విజయ్ దేవరకొండ తో కలసి పాల్గొన్నారు. ఆ షోలో రష్మిక మాట, యాస చూసి సోషల్ మీడియాలో పలువురు ట్రోలింగ్  చేశారు. ఆమె హిందీ యాస బాగోలేదని, సబ్ టైటిల్స్ కావాల్సిందేమోనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో జావేద్ అఖ్తర్ ఆమెకు మద్దతుగా ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఆమెను అనేవారు అసలు తమిళంలో నాలుగు మాటలు ధారాళంగా మాట్లాడి వినిపించాలని సవాల్ విసిరారు. అంతేకాక మనలో ఎంతమంది ఆంగ్ల భాషను ఇంగ్లీష్ మాతృభాషగా కలిగిన వారితో సమానంగా వారి యాసలోనే మాట్లాడుతున్నామో గమనించాలని నిలదీశారు. మరి అప్పుడు ఇంగ్లీష్ వారు మన యాసను వెక్కిరిస్తే ఎలా ఉంటుందని జావేద్ అఖ్తర్ ప్రశ్నించారు. ఒకరిని అనేమందు తామెంత వరకు ఇతర భాషలను ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నామో గ్రహించాలన్నారు. ఈ సందర్భంగానే రష్మికను ఆయన తమిళ నటిగా సంబోధించారు. దీన్ని మరికొందరు తప్పుపడుతూ, ఆమె తమిళ నటి కాదని, కన్నడ నటి అని, ఆమె మాతృభాష కొడగు అని గుర్తు చేశారు. రష్మికకు మద్దతుగా మాట్లాడినందుకు పలువురు నెటిజన్లు జావేద్ ను అభినందించారు. కాగా తాను రష్మిక ను తమిళనటి అని సంబోధించి ఉండకూడదన్నారు. అయినా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ ఏ భాష అయితేనేం భావం ముఖ్యమని అఖ్తర్ అన్నారు.  

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating