Articles & Opinion

JANSURAJ PARTY wins COUNCIL seat in BIHAR

 బీహార్ లో ఎంఎల్ సి సీటు గెలిచిన జన్ సురాజ్ !

 పాట్నా ; ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ బీహార్ లో ఒక ఎంఎల్ సి సీటు గెలుచుకుంది. రాష్ట్రంలోని 8 కౌన్సిల్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఐదు ఎన్ డి ఎ కూటమి గెలుచుకోగా, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఒక సీటును జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి సురేశ్ ప్రసాద్ రాయ్ గెలుచుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బంకీపూర్ సీటును గెలుచుకొని ప్రశాంత్ కిశోర్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ పార్టీ దర్భాంగ నుండి టీచర్ కానిస్టిట్యుయెన్సీ సీటును గెలిచి కౌన్సిల్ లో ప్రవేశించింది.

 కాగా, మహాఘట్ బంధన్ పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్, ఆర్జెడి. సిపిఎం తదితర పార్టీలు ఇప్పుడు కూడా కౌన్సిల్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకొన్నప్పటికీ 12 స్థానాల్లో స్నేహపూర్వక పోటీ పేరుతో ఈ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టాయి. అయితే ఆ 12 చోట్ల కూడా ఎన్డిఏ అభ్యర్థులే విజయం సాధించడం గమనార్హం. ఇప్పుడు కూడా కౌన్సిల్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. దీంతో దర్భాంగలో కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి మదన్ మోహన్ ఝా ను ప్రశాంత్ కిశోర్ పార్టీ కి చెందిన సురేశ్ ప్రసాద్ ఓడించారు. గతంలో మదన్ మోహన్ రెండుసార్లు ఈ స్థానం నుండి కౌన్సిల్ కు ప్రాతినిధ్యం వహించారు. పిసిసి అధ్యక్షునిగా, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు.     

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate