Andhra Pradesh

Indian Oil Corporation To Sell Water Botteles : ఇకపై మంచినీళ్ళ బంకులు !

  • పెట్రోల్ తో పాటు వాటర్ బాటిల్స్ !
  • అదనపు ఆదాయం కోసం ఐఓసి నిర్ణయం ..
  • 44 వేల పంపుల్లో విక్రయాలకు రెడీ …

న్యూఢిల్లీ ; ఆదాయం పెంచుకునేందుకు పెట్రోల్, చమురు ధరలు పెంచుకోవడమొక్కటే కాకుండా ఇతర మార్గాలు వెదకాలనుకున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన బంకుల్లో మంచినీళ్లు కూడా అమ్మాలని డిసైడ్ చేసుకుంది. దేశవ్యాప్తంగా తనకున్న 44 వేల పెట్రోల్ బంకుల ద్వారా ప్యాకెజ్ డ్ డ్రింకింగ్ వాటర్ ను విక్రయించాలని నిర్ణయించుకుంది. దీంతో అటు కంపెనీకి అదనపు ఆదాయం, ఇటు కస్టమర్లకు అదనపు సౌకర్యం అందించినట్లవుతుందని ఐఓసి భావిస్తోంది. ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూస్తామని, నాణ్యతలో రాజీపడబోమని కంపెనీ తెలిపింది. నాణ్యమైన మంచినీళ్లను తమ బ్రాండ్ ద్వారా సరఫరా చేసేందుకు ముందుకు రావాలని ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే పెట్రోల్ బంకుల్లో డీసెల్, ఇతర లూబ్రికెంట్లు అమ్ముతున్న సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల స్నాక్స్ కూల్ డ్రింక్స్ కూడా విక్రయించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కంపెనీకి ఉన్న 43.603 ఔట్ లెట్లలో 21.435 బంకులు హైవేలపైనే ఉన్నాయి. పాలిథీన్ బాటిల్స్ లో ఐఓసి విక్రయించే మంచినీళ్లు పావులీటర్, అరలీటర్ తో పాటు, లీటర్ బాటిల్స్ కూడా ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఆయిల్ కాకుండా ఇతర వస్తువుల విక్రయాలతో ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఈ నీళ్ళ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వివరించింది. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న చమురేతర ఆదాయాన్ని రూ.200 కోట్ల నుంచి 760 కోట్ల దాకా పెంచుకోవాలని ఆశిస్తున్నట్టు ఐఓసి తెలిపింది.

          ………………………………………………..     

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating