లాల్ హిట్ జనతా పార్టీ ఏర్పాటు
న్యూఢిల్లీ ; కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) కి వ్యతిరేకంగా దేశరాజధానిలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దాని పేరు ‘లాల్ హిట్ జనతా పార్టీ ’ (ఎల్ హెచ్,జెపి). ఆదివారం నాడిక్కడి మాలవ్యా స్మృతి భవన్ లో దాని ప్రథమ సమావేశం జరిగింది. బొద్దింకలను చంపడానికి వాడే క్రిమిసంహారక మందు హిట్ స్ప్రే ను మనం వాడుతున్న సంగతి తెలిసిందే. కాబట్టి సిజెపిని అడ్డుకునేందుకు రెడ్ హిట్ స్ప్రేలా తమ పార్టీ పేరును ఎంచుకున్నట్టు దాని వ్యవస్థాపకుడు అయన్ భట్నాగర్ తెలిపారు. అతితక్కువ వ్యవధిలోనే తామిచ్చిన పిలుపునకు స్పందించి సభ్యత్వం తీసుకునేందుకు పెద్దసంఖ్యలో జనం తరలి వచ్చారని ఆయన తెలిపారు. ఇక ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిస్తే ఇంకెంత మంది జాయినవుతారో అని ఆయన అన్నారు. తాము సిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని భట్నాగర్ చెప్పారు.
దసరా, దీపావళి పండుగలు దుష్టులైన రాక్షసులపై మంచి సాధించిన విజయానికి ప్రతీకలుగా దసరా,దీపావళి పండుగలు జరుపుకుంటామని ఆయన తెలిపారు. కాగా ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలంతా కాక్రోచ్ లను, కాంగ్రెస్ పార్టీని, ఇతర ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. నిరసన ప్రదర్శనలతో రాజ్యాంగ సంస్థలను పనిచేయకుండా చేస్తున్నారని, కన్నాట్ ప్లేస్ వంటి చోట్ల ఆందోళనలు చేస్తూ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
తాము కాక్రోచ్ జనతా పార్టీని నిర్మూలిస్తామని ఆయన తెలిపారు. తమకు కెనడా, అరబ్ ఎమిరేట్స్ దేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోందన్నారు.
