Gossips

Finally Shahid Comes On OTT After 13 Years : ఎట్టకేలకు ఓటిటిలో ‘షహీద్’ !

* అవార్డ్ ఫిల్మ్ కే ఇంత ఆలస్యమా ?

* అంతర్జాతీయ వేదికలపై అనేక ప్రశంసలు.

 ముంబయ్ ; జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా పేరుగాంచిన ‘షహీద్’  సినిమా 13 ఏళ్ల తర్వాత ఓటిటిలో రిలీజవుతోంది. ముంబయిలో 2013లో  జరిగిన 61 వ జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్  అవార్డ్స్ కార్యక్రమంలో ఈ చిత్ర కథానాయకుడు రాజ్ కుమార్ రావ్ కు ‘ఉత్తమ నటుడి’ అవార్డు, చిత్ర దర్శకుడు  హన్సల్ మెహతాకు ‘ఉత్తమ దర్శకుని’ అవార్డు లభించింది. 2010లో దారుణహత్యకు గురైన మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది షహీద్ ఆజ్మీ జీవితకథ ఆధారంగా ఈ ‘ షహీద్’ ను నిర్మించారు. 2012లో కెనడా రాజధాని టొరొంటోలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో తొలిసారిగా ప్రదర్శితమైంది. అమెరికాలో, జర్మనీలో, దుబాయ్ లో జరిగిన అంతర్జాతీయ ఉత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. ముంబయ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రానికి ‘ సిల్వర్ గేట్ వే ట్రోఫీ’ అందజేశారు. ఆ తర్వాత థియేటర్లలో విడుదలయింది. అయితే ఆ తర్వాత ఓటిటిలో మాత్రం రిలీజ్ కాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు దానికి చలనం వచ్చింది. ప్రైమ్ విడియోస్ లో విడుదలవుతోంది.

           మానవ హక్కుల పరిరక్షణ కోసం తపించే న్యాయవాది షహీద్ ఆజ్మీ జీవితం ఆధారంగా నిర్మితమైన ఈ సినిమా అనేక ప్రశంసలను అందుకుంది. ఉగ్రవాదులనే పేరుతో  అరెస్టయినవారి తరఫున కోర్టుల్లో వాదించి, వారిలో పలువురు నిర్దోషులని, నిరపరాధులని నిరూపించి  ఆ అమాయకులను విడుదల చేయించే న్యాయవాదిగా రాజ్ కుమార్ రావ్ సినిమాలో జీవించారు. ఇన్నేళ్ళ తర్వాత ఈ సినిమా ఓటిటిలో విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని, అందరూ తప్పకుండా చూడాలని కోరుతూ దీనికి రైటర్ గా, ఎడిటర్ గా వ్యవహరించిన అపూర్వ. ఎం.ఆస్రానీ తన ఎక్స్ ఖాతాలో కోరారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ తో పాటు, మహమ్మద్ జీషాన్, బలిజీందర్ కౌర్, ప్రబ్లీన్ సంధు తదితరులు నటించారు. 2014 నుంచి దేశరాజకీయాల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రశ్నించేవారిని వేధించడం, వెంటాడడంతో అనేకమంది నటీనటులు, దర్శకులు, ప్రజాస్వామిక వాదులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆస్రానీ తన పోస్ట్ లో వివరించారు.

                 ………………………     

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 2 ratings