Gossips

  Dino Morea Arrested?  బాలీవుడ్ నటుడు డీనోమోరియా అరెస్ట్ ?

  • 65 కోట్ల స్కాం లో 8 గంటల పాటు విచారణ

 ప్రముఖ బాలీవుడ్ నటుడు డీనోమోరియాను ముంబయి ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే దీనిని డీనో ఖండించారు. కాగా,  ముంబయిలోని మీఠీ నది పూడిక తీతకు సంబంధించిన కాంట్రాక్టులో అవకతవకలు, చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆర్థికనేరాల విభాగం పోలీసులు డీనోమోరియాను ఆయన నివాసం బాంద్రాలో దాదాపు 8 గంటలకు పైగా ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కేతన్ కదమ్ తో డీనోమోరియా, ఆయన సోదరుడు సాంటినో మోరియాలు పలుమార్లు ఫోన్లలో మంతనాలు జరిపారని పోలీసులు వివరించారు. ముగ్గురి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలకు సంబంధించి కాల్ డేటాలను సేకరించారని, మునిసిపల్ కాంట్రాక్టుకు సంబంధించిన మరికొన్నిఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మీఠీ నది పూడిక తీత కాంట్రాక్టులో ముంబయి మునిసిల్ కార్పొరేషన్(బిఎంసి) కు సుమారు 65.54 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిసింది.

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating