India

CM VIJAY COMPLETED 5 MONTHS

విజయ్ పాలన పై జనం ఏమంటున్నారు ?

  • నిధులు లేకున్నా సంక్షేమానికి పెద్దపీట !

టివికే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆరోనెల లోకి అడుగు పెట్టారు. ఎన్నికలకోసం చేసిన అనేక వాగ్దానాలను నెరవేర్చేందుకు రాష్ట్ర ఖజానా ఆయనకు  సహకరించడం లేదు. అయినా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ ,విసికె , ఐయుఎమ్ ఎల్ ల సాయంతో ఆయన సర్కార్ ను ఏర్పాటు చేసినప్పటికి సందర్భం వస్తే విమర్శించడానికి వారు వెనుకాడడం లేదు. ఎఐఎడిఎం కె నుండి విజయ్ సర్కార్ కు అనూహ్య మద్దతు లభించింది. ఇప్పటికయితే ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు.

సంక్షేమానికి ఆయన అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉచిత కరెంట్ ను అందచేస్తున్నారు. రైతులకు 75 వేల రూపాయల వరకు రుణ మాఫీ చేశారు. ఇందుకోసం 6 వేల కోట్లు ఖర్చు చేసారు. దీనివల్ల 14.43 లక్షల మంది రైతులకు లభ్ది చేకూరింది. చెరకు పంట పై టన్నుకు నాలుగు వేల అదనపు ప్రోత్సాహం , అలాగే వరి ధాన్యం పై 2.750 ప్రోత్సాహం అండ చేస్తున్నారు. మేనమామ బహుమతి కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన పిల్లలకు బంగారు  ఉంగరాలు, నవ వధువులకు పట్టు చీర, బంగారు నాణెం, ఇంటర్ విద్యార్థులకు సైకిళ్ళు ఇస్తున్నారు. అలాగే కాలేజి విద్యార్థులకు లాప్ టాప్ లు ఇస్తున్నారు. హౌసింగ్ స్కీం కోసం 35oo కోట్లు కేటాయించారు .

 అయితే ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది . గత ప్రభుత్వం 10  లక్షల కోట్లు అప్పు మిగిల్చగా , ప్రస్తుతం అది 13 లక్షలకు చేరి సిఎం విజయ్ కి కంటి మీద కునుకు లేకుండ చేస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో లక్ష కోట్లు వస్తాయని, 1.20 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని  అంటున్నారు. గత ఆగస్టులో 97 ఎం.ఓయు లు కుదుర్చుకున్నా రూ. 67.452 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. కరెంట్ కోతలతో జనం అల్లా  డుతున్నారు. అక్కడక్కడ నిరసనలు తెలుపుతున్నారు. అవినీతి ఆరోపణలు ఇప్పటివరకు లేవు. తమ వాటా ఎలా వసూల్ చేసుకోవాలో కొత్త మంత్రులకు ఇంకా తెలియదని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇక శాంతిభద్రతల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో డిఎంకె  అధినేత స్టాలిన్ విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ని సినిమా సెట్టింగ్ లా మార్చారని, సిఎం విజయ్ సినిమా డైలాగ్ లు కొడుతున్నారని ఆయన ఆరోపించారు. టివికె అధికారం లోకి వచ్చిన 12 రోజుల్లోనే 30 నేరాలు జరిగాయని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. మహిళల రక్షణ కోసం విజయ్ ఏర్పాటు చేస్తానన్న ప్రత్యేక దళం ఏదని ఆయన ప్రశ్నించారు. సలహాదారు నియామకం , ఆర్ టి ఐ చట్టం విషయం లో జారి చేసిన ఆదేశాలను ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తానికి విజయ్ సర్కార్ నిలదొక్కుకున్నప్పటికీ ముందుముందు తెలుస్తుంది అసలు సంగతి.

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating