Andhra Pradesh

Chirag Paswan Sensational Comments On Examinations : పరీక్ష రద్దయితే పైసలివ్వాల్సిందే !

 -కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ డిమాండ్

 పాట్నా ; దేశంలో ఎక్కడ ఏ పరీక్ష ఏదేని కారణాలతో రద్దయితే అది రాసేందుకు సిద్ధమయిన వారికి ప్రయాణ చార్జీలు, వసతికి అయ్యే ఖర్చులు, భోజనాలకు అయ్యే ఖర్చును చెల్లించాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాము పార్లమెంట్ లో లేవనెత్తుతామని ఆయన తెలిపారు. ఇది విద్యార్థుల, అభ్యర్థుల న్యాయమైన హక్కుగా తమ పార్టీ లోక్ జనశక్తి (రాంవిలాస్ ) భావిస్తున్నదని చిరాగ్ అన్నారు.. దేశంలో చాలా చోట్ల రకరకాల పరీక్షలు చివరి నిమిషంలో రద్దవుతూ విద్యార్థులకు, నిరుద్యోగులకు వ్యయప్రయాసలు, మానసిక క్షోభ మిగుల్చుతున్న సంగతి తెలిసిందే. ‘యూత్ బోలే తో’ అనే ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన యుపిలోని ప్రయాగ్ రాజ్ లో ప్రారంభించినపుడు బ్రహ్మాండమైన స్పందన లభించిందన్నారు. కాగా యువతరానికి తమ అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పే అవకాశం ఉండాలన్నారు. వచ్చే యుపి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.

                   ……………….  

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating