Articles & Opinion

    C0ffee with RAHUL..Travel with PM

       కాఫీ విత్ రాహుల్..ట్రావెల్ విత్ పిఎం

  • దటీజ్  CM విజయ్ !

 చెన్నయి ; ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనేది మహేశ్ బాబు సినిమాల్లో పాపులర్ డైలాగ్. తాజాగా తమిళ నాడు సిఎం జోసెఫ్ విజయ్ ఎలా రాజకీయాల్లో పండిపోతున్నాడో తెలుస్తోంది. ఎంత లేట్ గా రాజకీయాల్లోకి వచ్చామన్నది కాకుండా ఎంత లేటెస్ట్ గా వ్యవహరిస్తున్నా మనేదే ముఖ్యం. లౌక్యంలో విజయ్  చాణక్యుడిని అనుసరిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కాఫీ కబుర్లు, లంచ్ మీటింగ్ లు జరిపుతూనే , ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మెట్రోలో ప్రయాణిస్తూ మంతనాలు జరిపారు. ఇదంతా రెండు రోజుల వ్యవధిలోనే జరగడంతో  రాజకీయ పరిశీలకులు పరిపరి విధాలా కామెంట్స్ చేసేదాకా వెళ్ళింది. గత ఆదివారం చెన్నయ్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని సిఎం విజయ్ సాదరంగా రిసీవ్ చేసుకోవడం, గౌరవంగా సాగనంపడం, మెట్రోరైలు ప్రారంభించాక ఆయనతో కలసి అదే రైల్లో పయనించడం అంతా జరిగిపోయాయి. మద్రాస్ ఐఐటిలో జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ సిఎం విజయ్ పేరు ప్రస్తావించగానే సభలో కొందరు ‘భావి ప్రధాని విజయ్.’.. ‘2029 లో ప్రధాని విజయ్’ అంటూ నినాదాలు చేశారు. ఆమేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు జోక్యం చేసుకుని సద్దుమణిగేలా చేసినప్పటికీ వారు అటు తిరగగానే మళ్ళీ అవే నినాదాలు మిన్నంటాయి. కాగా అంతకుముందు రోజే లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడులో పర్యటించారు. ఆయన సిఎం విజయ్ నివాసంలో లంచ్ చేశారు. బాస్క్ కఫేలో విజయ్ తో కలసి కాఫీ తాగారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కొందరు  ‘‘ కాఫీ విత్ రాహుల్…ట్రావెల్ విత్ మోడీ ’’ అంటున్నారు. అయినా దేశప్రధాని హోదాలో వచ్చిన మోడీకి ముఖ్యమంత్రిగా విజయ్ స్వాగత సత్కారాలు చేయడం తప్పేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.మిత్రునిగా తమకు రాష్ట్రంలో మద్దతునిస్తున్న పార్టీ అగ్రనేతగా రాహుల్ వచ్చారని ఇద్దరికీ సముచిత గౌరవం వ్వడంలో తప్పుపట్టేది ఏం ఉందని, దీంట్లో రాజకీయాలు వెదకనవసరం లేదంటున్నారు.      

Rate this article

How useful or interesting did you find this story?

4.5/5 2 ratings