Articles & Opinion

     ARAVIND SWAMY N0T 0NLY AN ACTOR,

      TRUE BUSINESS MAN !

    అరవింద స్వామి ఆస్తులు 3500 కోట్లు ?

  • అప్పులంటే చాలా భయం

 చెన్నయి ; ప్రముఖ బహుభాషా నటుడు అరవింద స్వామి సినిమాల్లో కంటే వ్యాపారంలోనే బాగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 3500 కోట్ల పైమాటే. వారిది మొదటి నుంచి వ్యాపార కుటుంబమే. సినిమాల్లోకి కాకతాళీయంగానే వచ్చారు. అనంతరం చాలా గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు. అయితే ఆయన దృష్టి అంతా సినిమాలపై కాకుండా వ్యాపారంపైనే ఉంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) పైనే ఆధారపడుతుండడంతో రెండున్నరేళ్ల కిందటే అరవింద స్వామి ఎఐ రంగంలోకి  అడుగుపెట్టారు. ఆయన కుమారుడు రుద్ర దీని వ్యవహారాలు చూస్తున్నారు. ఎఐ ఆధారిత ప్రొడక్టుల తయారీ కోసం వారి కంపెనీ కృషి చేస్తోంది.

    పూర్తిగా డబ్బు సంపాదనమీదే తన దృష్టి ఉండదని, ఆయా రంగాల్లో సవాళ్లను పరిష్కరించడానికే తాను ఇష్టపడతానని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వ్యాపారం కోసం అప్పులు చేయడం అంటే తనకు చాలా భయమన్నారు. ఉన్నంతలో అప్పుల భారం లేకుండా వ్యాపార నిర్వహణకే తాను మొగ్గుచూపుతానన్నారు.  

  1990లో ఆయన సినీరంగంలో ప్రవేశించారు. రోజా, బొంబాయి, దళపతి, కాదల్ వంటి సినిమాల్లో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. 2000 సంవత్సరంలో ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి సినిమాలు చేయలేదు. మళ్లీ పదేళ్ళ విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. హీరో పాత్రలే కాకుండా ధ్రువ వంటి సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించి ప్రశంసలు పొందారు. చాలామంది నటుల వలెనే ఆయనకు డాక్టర్ కావాలని ఉండేది. కాని పారిశ్రామిక వేత్త అయిన తండ్రి వి.డి.స్వామి సూచన మేరకు బి.కామ్ చదువుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మాస్టర్స్ (ఎంఐబి) కోర్సు చదివేందుకు విదేశాలకు వెళ్లారు. అది పూర్తి చేయకండానే వచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  

 ఆతర్వాత విడిస్వామి అండ్ కంపెనీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కంపెనీ స్టీల్ వ్యాపారం చేస్తుంది. అరవింద స్వామి ఇంటర్ ప్రో గ్లోబల్ అనే కంపెనీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రొలీజ్ ఇండియా కంపెనీకి సిఎండిగా వ్యవహరిస్తున్నారు. ఆయన సొంతగా టాలెంట్ మాగ్జిమస్ ఇండియా అనే కంపెనీ ప్రారంభించారు. ఇది ప్రధానంగా వివిధ దేశాల్లో అనేక కంపెనీలకు మానవవనరులను అందిస్తుంది. ఆ మధ్య జరిగిన ప్రమాదంలో ఆయన ఎడమకాలు పూర్తిగా దెబ్బతింది. సొంతగా నడవలేకపోయేవాడు. నాలుగైదేళ్లు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే సినిమాలేమీ చేయలేదు. ఆ తర్వాతే కోలుకుని 2013 నుండి మళ్ళీ నటించడం ఆరంభించారు.

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating