- లారెన్స్ బిష్టోయి గ్యాంగ్ పనే
ముంబయి ; ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ పై ఆదివారం సాయంత్రం జుహు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఈ దాడిలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. కారు డ్రైవర్ గాయపడ్డాడు. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి దుండగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ఈ కాల్పులు తమ పనేనని, తమ మాట వినని వారికి ఇదే గతి పడుతుందని పేరుమోసిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్టోయి పేరుతో సోషల్ మీడియాలో హెచ్చరికలు వచ్చాయి. 2024లో ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై లారెన్స్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. అప్పటి నుండి పోలీసులు సల్మాన్ కు గట్టి భద్రత కల్పిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయి ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అక్కడి నుండే బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
సోషల్ మీడియా పోస్టుల్లో ‘జై మహాకాళి, జై శ్రీరాం..డియర్ బ్రదర్స్.. సల్మాన్ ఖాన్ తో కలసి నటించవద్దని హెచ్చరిస్తున్నాం. మా మాటవినకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఈ రోజు టైగర్ ష్రాఫ్ కు ఏం జరిగిందో చూశారు. ముంబయి ఫిల్మ్ ఇండస్ట్రీ మేం చెప్పినట్టు వినాల్సిందే అని పేర్కొన్నారు. వీటి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
