Latest News

Aadarsha Kutumbam… Review:-1/5

త్రివిక్రమ్…..మాటల మాంత్రికుడు.. ఇది తెచ్చుకున్న పేరు అసలు పేరు కాపీల తాంత్రికుడు.. తీసిన ప్రతీ సినిమా కాపీయే. దొంగతనంగా కధను లేపెయ్యడం.. నాది అని ఎవరైనా వస్తే డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్. రాకపోతే తన క్రియేటివిటీ అని గొప్పలు చెప్పుకునే ఈ కధా కబ్జాదారుడి క్రియేటివిటీ ఈ సినిమాలో పనిచెయ్యలేదు. మేధస్సు అనే ముసుగులో కనిపిస్తున్న ఈ కాపీ దర్శకుడుతీసిన మరో పసలేని కాపీచిత్రం “ఆదర్శకుటుంబం”. వెంకటేష్ ,సత్య నవ్వులు లేకపోతే ఈ సినిమా నాలుగు షో లు కూడా పడదు ఆమధ్య ఫెయిల్యూర్స్ లో ఉన్న ఒక ఓల్డ్ హీరో తో ఒక నూతన దర్శకుడు పరభాషా సినిమా నుండి కాపీ కొట్టి తీసి” బ్లాస్ట్ హిట్” అందించాడు. ఇప్పుడు సూపర్ హిట్స్ లో వున్న వెంకటేష్ లాంటి బడా హీరో తో ఈ త్రివిక్రమ్ అనే సీనియర్ దర్శకుడు అదే పరభాషా సినిమా కాపీకొట్టి ఫ్లాప్ తీసాడు. దీన్నిబట్టి మనం అర్ధంచేసుకోవాల్సింది త్రివిక్రమ్ కలంలో నుండి కధనంలోమెరుపులు, నవ్వులు జారడం ఆగిపోయాయి. ఒకప్పుడు ఇతనొక్కడే కాపీని తొందరగా అందుకునేవాడు. ఇప్పుడు ప్రతీదర్శకుడూ కాపీని అందుకోవడంలో పోటీ పడుతున్నారు. అందుకే ఈ మాటల మాంత్రికుడి కాపీమంత్రాలు ఇక పనిచెయ్యడం కష్టమే. అక్కడక్కడా దర్శకుడు తన మార్క్ ప్రదర్శించినా, వెంకటేష్ తన స్టైల్ కంటిన్యూ చేసినా, కధ మాత్రం అసహనం కలిగిస్తుంది. కేవలం వెంకటేష్ కి వున్న ఫ్యామిలీ ఇమేజ్ వల్లమాత్రమె చూడగలం ఇంత పెద్ద దర్శకుడు… పెద్దబేనర్… పెద్దహీరో తీసిన ఒక చవకబారు సినిమా “ఆదర్శకుటుంబం”

Rate this article

How useful or interesting did you find this story?

2.0/5 1 rating