Movies

ఈవారం ఓటీటీ వాచ్ లిస్ట్ : 5 సౌత్ సినిమాలతో సందడి!

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకి ఒక ప్రత్యేకత వుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, మనోరమామాక్స్, నెట్‌ఫ్లిక్స్, ఆహా యాప్ లలో ప్రతి ఒక్కటీ  ఒక దక్షిణాది సినిమాని  విడుదల చేయనున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్ని ఇవి కవర్ చేస్తున్నాయి. ఆ సినిమాలు జైలర్ 2, బాంద్రా, ది థర్డ్ మర్డర్, రణబాలి, క్రేజీ కళ్యాణ్ మొదలైనవి. కాబట్టి ఈ వారం పాటు సౌత్ సినిమాల్ని ఎంజాయ్ చేసే అరుదైన అవకాశం ఇదే. మిస్ చేసుకోకండి. వివరాలు ఈ క్రింద…

1. జైలర్ 2, అమెజాన్ ప్రైమ్ వీడియో, నవంబర్ 12

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సీక్వెల్‌లో రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా తిరిగి వస్తున్నారు. పదవీ విరమణ చేసిన జైలర్ తన కుటుంబాన్ని బెదిరిస్తున్న ఒక క్రిమినల్ సిండికేట్‌తో కొత్త పోరాటంలోకి దిగుతాడు. రమ్యకృష్ణ, మోహన్‌లాల్, విజయ్ సేతుపతి, శివరాజ్‌కుమార్, ఎస్.జె. సూర్య, హృతిక్ రోషన్, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి తదితరులు ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ లో నటించారు. ఇది తమిళ, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో  ప్రసారం అవుతోంది.

2. బాంద్రా, జీ5, నవంబర్ 13

దిలీప్, తమన్నా భాటియాల 2023 మలయాళ రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూడు సంవత్సరాలకి పైగా విరామం తర్వాత ఎట్టకేలకు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. అరుణ్ గోపి దర్శకత్వం వహించిన ఈ మూవీ, , 1990ల నాటి హిందీ సినిమా గ్లామర్, అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో దిలీప్ వ్యాపారవేత్త అలెగ్జాండర్ ఆలా డొమినిక్‌గా, తమన్నా నటి తారా జానకిగా నటించారు. డైనో మోరియా, మమతా మోహన్‌దాస్, ఆర్. శరత్‌కుమార్, సిద్ధిక్ సహనటులుగా ఉన్నారు.

3. ది థర్డ్ మర్డర్, మనోరమామాక్స్, నవంబర్ 13

సునీల్ ఇబ్రహీం దర్శకత్వం వహించిన మలయాళ థ్రిల్లర్ ‘డివైఎస్పి క్రిస్టీ’లో సైజు  కురుప్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వరుస హత్యలపై పోలీసులు జరిపే దర్యాప్తు దీని కథాంశం. సరైన ఆధారాలు లేకపోవడంతో, క్రిస్టీ సహాయం కోసం ఒక రిటైర్డ్ అధికారిని ఆశ్రయిస్తారు. ఇంద్రన్స్, వినయ్ ఫోర్ట్, అనన్య,  లియోనా కూడా ఇందులో నటించారు. అంతర్జాతీయ ప్రేక్షకులు దీనిని ‘సింప్లీ సౌత్’లో చూడవచ్చు.

4. రణబాలి, నెట్‌ఫ్లిక్స్, నవంబర్ 13 

బ్రిటిష్ పాలన కాలంలో, 1870లలో జరిగిన మహా మద్రాసు కరువు సమయంలో రాయలసీమలో జరిగిన సంఘటనల ఆధారంగా రాహుల్ సంకృత్యాన్ రూపొందించిన ఈ  తెలుగు పీరియడ్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ, రశ్మికా  మందన్న మళ్లీ జతకట్టారు. విజయ్ ఒక తిరుగుబాటు యోధుడి పాత్రలో,  రశ్మిక అతడి భార్య జయమ్మ పాత్రలో కనిపిస్తారు. ఆర్నాల్డ్ వోస్లూ విలన్ గా నటించాడు. 

5. క్రేజీ కల్యాణం, ఆహా, విడుదల తేదీ త్వరలో 

తెలంగాణలోని మెదక్ నేపథ్యంలో  తెరకెక్కిన తెలుగు ఫ్యామిలీ కామెడీలో అనుపమా పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించారు.. తనకంటూ సొంత కెరీర్ ప్రణాళికలు ఉన్న చిన్న కూతురు అనుపమకి ఆర్థికంగా స్థిరపడిన సంబంధం వెతకాలని ప్రయత్నించే తండ్రి పాత్రలో నరేష్ నటించారు. ఆహా సంస్థ దీనిని నవంబర్ విడుదలల జాబితాలో చేర్చింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తుంది.

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 1 rating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *