గురితప్పిన “సీన్”
సూర్య… తెలుగు ప్రేక్షకులకు అతి దగ్గరైన తమిళ హీరో
భిన్నమైన కథలతో, విభిన్నమైన నటనతో ప్రేక్షకుల మన్ననల్ని పొందిన సూర్య ఈ “సీన్” సినిమాతో గురి తప్పాడు.
తన ఎనర్జీని దాటి హీరో కథని ఎంచుకుంటే ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యి ఆ హీరోకి బ్రహ్మరథం పడతారు.
మరి తన స్థాయిని తగ్గించే సిఐడి ఎపిసోడ్ లాంటి కథలను ఎంచుకుంటే సూర్య లాంటి అగ్ర హీరో కూడా అట్టడుగు స్థాయికి పడిపోవడం ఖాయం.
ఏ వెబ్ సిరీస్ చూసిన పోలీస్… ఇన్వెస్టిగేషన్.. మర్డర్.. మరి ఈ సినిమాలో కూడా అలాగే ఉంటే పెద్ద హీరో కూడా వెబ్ సిరీస్ కంటెంట్ తో సినిమా తీస్తే చూడడానికి థియేటర్ కి ఎందుకు?
ఈ ప్రశ్న ఈ సినిమా చూస్తే మనకు మెదడులో మొదలవుతుంది ప్రేక్షకులకు ఓటిటి దగ్గరయ్యాక, సినిమా కంటెంట్ వేరు, ఓటిటి కంటెంట్ వేరు అనే మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఈ సినిమాను అంగీకరించిన సూర్య కథా ఎంపిక గురి తప్పింది. ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. ఎన్ని బుల్లెట్లు ఉన్న గన్ అయినా గురి తప్పితే అపజయమే కదా!
డార్క్ కామెడీ నమ్ముకున్న ఈ టీము కామెడీ లేకుండా ఒక డార్క్ సినిమా తీసింది. కాబట్టి థియేటర్ కన్నా ఇంట్లో అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు, పది పది నిమిషాలు చొప్పున ఒక 12 రోజుల్లో ఓటీటీలో చూసేయొచ్చు.

Leave a Reply