Articles & Opinion

TRISHA at WEDDING RECEPTION

CM VIJAY , YS Jagan present

అనిల్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ లో త్రిష, విజయ్

 చెన్నయి ; ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం. వైఎస్.జగన్మోహన్ రెడ్డి కజిన్ వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ, ఉజ్వల్ ల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో తమిళనాడు  సిఎం జోసెఫ్ విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ కలసి పాల్గొన్నారు.గురువారం నాడిక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, భారతి దంపతులు కూడా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి విజయ్ బ్రౌన్ సూట్ లో రాగా, త్రిష పింక్ శారీలో మెరిసారు. బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆయన శ్రీమతి శైలిమ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 హోటల్ లీలా ప్యాలెస్ లో జరిగిన ఈ రిసెప్షన్ కు పెద్దసంఖ్యలో ప్రముఖులు హాజరైనప్పటికీ త్రిష, విజయ్ లే ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రలతో కలసి పాల్గొన్న త్రిష అనంతరం చాలా కార్యక్రమాలకు విజయ్ తో కలసి హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా జోసెఫ్ విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. అనంతరం ఎన్నికల్లో విజయ్ నెగ్గి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక ఆమె విడాకుల దరఖాస్తును వాపసు తీసుకుంది.

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 2 ratings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *