Articles & Opinion

EMMY AWARDS Presenter VIJAY SETHUPATHI 

ఎమ్మీ అవార్డుల ఫంక్షన్లో విజయ్ సేతుపతి !

 చెన్నయి ; ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ నెల 23న న్యూయార్క్ లో జరిగే 54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనబోతున్నారు. 2016లో లాస్ ఏంజిలిస్ లో జరిగిన 68వ ప్రైమ్ ఎమ్మీ అవార్డులను  బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు టామ్ హిడిల్ స్టన్ తో కలసి విజేతలకు బహుమతులు అందజేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆ అవకాశం విజయ్ సేతుపతికి లభించింది. ఇతర ప్రముఖులతో కలసి విజయ్ ఈ అవార్డులను విజేతలకు అందజేస్తారు.

  వైవిధ్యభరితమైన పాత్రలతో చక్కని నటన ప్రదర్శిస్తూ విజయ్ సేతుపతి అనతి కాలంలోనే విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ఇటీవలి చిత్రం ‘ బత్తా’ కు కూడా మంచి పేరు వచ్చింది. 198‌0 దశకంలో చెన్నయి నగరంలో హడలెత్తించిన గ్యాంగ్ స్టర్ జీవితం ఆధారంగా రూపొందిన ఆ చిత్రంలో బత్తాగా విజయ్ సేతుపతి నటించారు. కాగా, ఆయన నటించిన ‘మహారాజా’ చిత్రం చైనాలో భారీ కలెక్షన్లు రాబట్టడంతో దాన్ని హాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.తనను కొన్నిహాలీవుడ్ సంస్థలు రీమేక్ రైట్స్ కోసం సంప్రతించాయని చిత్ర నిర్మాత సుధన్ సుందరం తెలిపారు.

 ఎమ్మీ అవార్డులను ప్రదానం చేసే ఇంటర్నేషనల్ టెలివిజన్ ఆర్ట్స్అండ్ సైన్స్ సంస్థలో బోర్డుమెంబర్ గా వ్యవహరిస్తున్న చిత్ర నిర్మాత కవితా గుప్తా భారతీయుల ప్రతిభను గుర్తిస్తూ, అంతర్జాతీయ వేదికలపై వారిని పరిచయం చేస్తోంది. గతంలో ప్రియాంక, వీర్ దాస్ తదితరులను, ప్రస్తుతం విజయ్ సేతుపతిని ఆహ్వానించడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది.   

Rate this article

How useful or interesting did you find this story?

5.0/5 2 ratings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *