– గాయని కణికా కపూర్
ముంబయి ; ప్రముఖ గాయని కణికా కపూర్ తన భర్త గౌతమ్ హతిరమణి నుండి విడాకులు తీసుకుంటోంది. వీరి వివాహం 2022 మే 20న లండన్ లో జరిగింది. బాగా ఆలోచించి తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు కణిక తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. ఈ నాలుగేళ్లలో తాము బాగానే ఉన్నామని, భవిష్యత్తులో గౌతమ్ బాగుండాలని కోరుకుంటున్నట్టు ఆమె తన పోస్టులో పేర్కొంది. కణికకు తొలిసారి 1998లో తన 18వ ఏటనే రాజ్ చందోక్ తో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు. ఆతర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమె ఇండియాకు తిరిగివచ్చి అనేక సినిమాల్లో పాటలు పడి గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. 15 ఏళ్లుగా తనకు తెలిసిన గౌతమ్ హతిరమణిని వివాహం చేసుకొమ్మని 2014లో, 2020లో అడిగింది. చివరకు 2022లో వారి పెళ్ళి జరిగింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ విడిపోతున్నారు. సన్నీలియోన్ నటించిన రాగిణి, షారూఖ్ ఖాన్,దీపిక నటించిన హాపీ న్యూఇయర్, ఉడ్ తా పంజాబ్ వంటి సినిమాల్లో కణిక పాడిన పాటలు బాగా హిట్టయ్యాయి.

Leave a Reply