Articles & Opinion

DELHI RALLY GRAND SUCSESS 

ఢిల్లీ మార్చ్ గ్రాండ్ సక్సెస్ ! 

 జ్ఞానేశ్ జైలుకు వెళ్ళాల్సిందే ‌; రాహుల్ 

న్యూఢిల్లీ ; ఇండియా కూటమి దేశరాజధానిలో ఆదివారం నిర్వహించిన బ్రహ్మాండైమన ర్యాలీ విజయవంతమైంది. సిఇసి జ్ఞానేశ్ కుమార్ ను అభిశంసిస్తూ శనివారం నాడిక్కడ నిర్వహించిన మాక్ పార్లమెంట్ కు కొనసాగింపుగా ప్రతిపక్షాలు ఈ ర్యాలీని నిర్వహించాయి. మింటో కాంపౌండ్ కన్నాట్ ప్లేస్ నుండి రాంలీలా మైదాన్ వరకు జరిగిన ర్యాలీలో లక్షలాదిమంది పాల్గొన్నారు. ఖర్గే నివాసం నుండి బయలు దేరిన ఓపెన్ టాప్ వాహనాల్లో ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆయన  సోదరి ఎంపి ప్రియాంక గాంధీ, యుపి, బెంగాల్ మాజీ సిఎంలు అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, బీహార్ ఆర్జెడి నేత తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు , కశ్మీర్ మాజీ సిఎం ఫరూఖ్ అబ్దుల్లా, సిపిఐ నేత డి.రాజా తదితర ప్రముఖులు ఆసీనులయ్యారు. తెలంగాణ భవన్ నుండి సిఎం రేవంత్ రెడ్డి తదితరులు రాంలీలా మైదాన్ కు చేరుకున్నారు. 

రాంలీలా మైదాన్ లో జరిగిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఓట్లు చోరీ చేసి, ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ పదవి నుండి తొలగించాలని, ఆయనను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. సిఇసి జ్ఞానేశ్ లేకపోతే నరేంద్రమోడీ గెలిచేవారే కాదన్నారు. అమిత్ షా కేంద్రహోం మంత్రి అయ్యేవారే కాదన్నారు. ఎంత డబ్బున్నా రాజ్యాంగం కన్నా పెద్దవారు కాదని  బిజెపిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జ్ఞానేశ్ ను తొలగించాలన్నది దేశంలో ప్రతి ఒక్కరి డిమాండ్ అన్నారు. బిజెపి , ఆర్ ఎస్ఎస్ లు దేశంలోని అన్ని వ్యవస్థలను కబ్జా చేశాయని రాహుల్ ఆరోపించారు. విద్యాసంస్థల నుంచి గూఢచార సంస్థల దాకా వాటి కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని ఆయన తెలిపారు. 

మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, నరేంద్రమోడీ పదవి నుంచి దిగిపోతేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుందన్నారు. యుపి, బీహార్, మహారాష్ట్రల్లో వారు అక్రమంగానే గెలిచారని ఆయన ఆరోపించారు. అసలు వారిని ఎవరు ఎన్నుకున్నారని, వారంతట వారే గెలిచినట్టు ప్రకటించుకున్నారని ఖర్గే విమర్శించారు. బిజెపి అధికారాన్ని దోచుకుంటున్నదని బెంగాల్ మాజీ సిఎం మమత ఆరోపించారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ నుండి స్పందనే లేదని యుపి మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.కాగా, ప్రతిపక్షాలు నిర్వహించిన ర్యాలీ విజయవంతమైందని పరిశీలకులు భావిస్తున్నారు. 

Rate this article

How useful or interesting did you find this story?

4.0/5 1 rating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *