Articles & Opinion

NO ENTRY for NON – HINDUS

  అన్యమతస్తులకు హిందూ ఆలయాల్లో నో ఎంట్రీ

  • మద్రాస్ హైకోర్టు రూలింగ్

 మదురై ; ఆగమశాస్త్రాల ప్రకారం నిర్మితమైన సనాతన హిందూ దేవాలయాల్లోకి ఇతర మతస్తులకు ప్రవేశం లేదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ రూలింగ్ ఇచ్చింది. పలువురు ఇతర మతాలవారు మదురై మీనాక్షి , అరుణాచలేశ్వరస్వామి ఆలయాలకు వస్తున్నారని అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ ఆదేశాలు జారీ  చేసింది. ఇతర మతస్తులు ఆలయాలకు వెళ్లి దేవతల దర్శనం చేసుకోవాలంటే ఆయా దేవతలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఆలయ మర్యాదలను, సంప్రదాయాలను పాటిస్తానని ఒక ప్రమాణపత్రం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ఈ విషయంలో ఆలయాల పాలకవర్గాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఇటీవల కొందరు క్రిస్టియన్లు అరుణాచలంలో నానా హంగామా చేసిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. వారు అలా చేస్తుంటే ఆలయ సిబ్బంది చోద్యం చూసినట్టు ఎందుకు ఉపేక్షించారని కోర్టు ప్రశ్నించింది.

 ఇటీవల మదురై సెంట్రల్ ఎంఎల్ ఎ బద్రుద్దీన్ ముస్తఫా ఎన్నికలయ్యాక ఎటువంటి అండర్ టేకింగ్ ఇవ్వకుండానే మదురై మీనాక్షి ఆలయంలోకి వెళ్ళాడు. అదేమని ప్రశ్నిస్తే అక్కడి సౌకర్యాల పరిశీలనకు వచ్చానని సమాధానమిచ్చాడు. అలాగే మరో క్రిస్టియన్ మంత్రి తిరుచెండూర్ ఆలయానికి వెళ్లాడని డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జిఆర్ స్వామినాథన్. పి.మురుగన్ లు వివరించారు. కాని సిఎం జోసెఫ్ విజయ్ మాత్రం  అండర్ టేకింగ్ ఇచ్చి మదురై మీనాక్షి ఆలయంలోకి ప్రవేశించాడని వారు గుర్తు చేశారు. అందుకే ఏ మతం వారైనప్పటికీ ఆయా దేవతల పట్ల భక్తివిశ్వాసాలు వ్యక్తం చేస్తూ అండర్ టేకింగ్ ఇచ్చి దర్శనం చేసుకోవచ్చునని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు.   

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate