కచోరి తింటుంటే 20 లక్షలు గాయబ్
జైపూర్ ; వ్యాపార వేత్త చంపాలాల్ సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నగదు కలెక్ట్ చేసుకుని వస్తూ ఒక కచోరి పాయింట్ వద్ద ఆగాడు. స్కూటర్ పైనే కూర్చుని ఆయన కచోరి తింటున్నాడు. ఇంతలో హఠాత్తుగా మరో స్కూటర్ పై అక్కడికి వచ్చిన ఇద్దరు ఆగంతకులు చంపాలాల్ స్కూటర్ పై ఉన్న రూ.20 లక్షల నగదు బ్యాగ్ లాక్కాని క్షణాల్లో పరారయ్యారు. స్థానికులతో కలసి ఆయన వారిని వెంబడించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జైపూర్ నగరంలోని నహర్ ఘడ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్లు ధరించిన ఇద్దరు అగంతకులు బ్యాగ్ లాక్కొని పోతున్న దృశ్యాలు సిసిటివి ఫుటేజ్ లో రికార్డయ్యాయి. దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
