కెబిసి దీపావళి షోలో సీతారామలక్ష్మణులు
ముంబయి ; బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో లో రామాయణ సినిమా పాత్రధారులు ప్రత్యేక అతిథులుగా పాల్గొంటున్నారు. దీపావళి సందర్భంగా కెబిసి -18 ప్రత్యేక కార్యక్రమంలో నితీశ్ తివారి సినిమా ‘‘రామాయణ’’ లో నటించిన రణబీర్ కపూర్ (రాముడు), సాయిపల్లవి (సీత), రవి డూబే (లక్ష్మణుడు) పాల్గొనబోతున్నారు. బాల్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకునేవారో కెబిసి వ్యాఖ్యాత అమితాబ్ వారిని అడిగి వివరాలు రాబట్టారు. తన పండుగ అనుభూతి కూడా ఈ సందర్భంగా బిగ్ బి వివరించారు. దీపావళి సందర్భంగా పక్కింటి వాళ్ల కన్నా మన టపాకాయలు బాగా పేలాయా లేదా అనే సంగతే బాగా గుర్తు పెట్టుకునే వారమని అమితాబ్ అన్నారు. ఈ షో సోని టివిలో ఈ నెల 29, 30 తేదీల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.
