Articles & Opinion

AK- 47 Firing during DASARA

Ankitha Sharma Controversy

ఆయుధపూజ సందర్భంగా ఎకె 47తో కాల్పులు

* వార్తల్లో లేడీ సింగమ్ !

 రాయ్ పూర్ ; విజయదశమి పండుగ సందర్భంగా ఆయుధ పూజ చేయడం ఆనవాయితీ. కాని ఆ సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ ఎకె.47 తీసుకుని నిజంగానే కాల్పులు జరిపి వార్తల్లోకెక్కారు. చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాజానందగావ్ జిల్లా ఎస్.పి అంకితాశర్మ దసరా పండుగ సందర్భంగా రాజానందగావ్ జిల్లా పోలీస్ లైన్స్ కార్యాలయంలో ఆయుధ పూజ చేశారు. అనంతరం ఎకె.47 ఎక్కుపెట్టి దాదాపు 9 రౌండ్ల కాల్పలు జరిపారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరలైంది. పలువురు నెటిజన్లు ఆమె ధైర్యాన్ని కొనియాడుతుండగా, మరికొందరు మాత్రం సీనియర్ ఐపిఎస్ అధికారిణి అయివుండి ఇలా నిర్లక్ష్యంగా ఆయుధాన్ని ఉపయోగించడమేంటని ప్రశ్నించారు. దుర్గ్ కు చెందిన అంకితా శర్మ 2018 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. ఆమెను అందరూ లేడీ సింగమ్ గా వ్యవహరిస్తారు.  

 చిన్నప్పుడు చదువులో అంతంతే ఉన్న అంకిత 9వతరగతి నుండి చురుకుగా మారారు. పదవ తరగతిలో 92 శాతం మార్కులు, ఇంటర్ లో 90 శాతం మార్కులు సాధించారు. డిగ్రీ పూర్తయ్యాక ఎంబిఎలో చేరినా మళ్లీ సివిల్ సర్విసెస్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యారు. మూడవ ప్రయత్నంలో ఆమె అఖిలభారత స్థాయిలో 203 వ ర్యాంకు సాధించి ఐపిఎస్ ఎంచుకున్నారు.

భరత్ పూర్, రాయిపూర్, ఖైరాఘర్ జిల్లాల్లో ఎస్ పిగా విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయుధపూజ సందర్భంగా గాలిలోకి కాల్పులు జరిపినందుకు రాష్ట్ర పోలీసుశాఖ ఆమెకు షోకాజ్  నోటీస్ జారీ చేసింది.  

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate