Articles & Opinion

KIM alive or NOT ?

కిమ్ ఉన్నట్టా…లేనట్టా..?

 ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ మరణించినట్టు పుకార్లు వస్తున్నాయి. దీన్ని ఖండిస్తూ ఆదేశపు వార్తా చానెళ్ళు కెసిఎన్ ఎ, నార్త్ కొరియా న్యూస్ కొన్ని ఫోటోలను విడుదల చేశాయి. ఓ షాపింగ్ మాల్ లో కిమ్ తన అధికారులు, అంగరక్షకులతో కలసి తనిఖీ చేస్తున్న దృశ్యాలు ఆ ఫోటోల్లో ఉన్నాయి. రెండు రోజుల కిందట కిమ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని, ఆయన బ్రెయిన్ హెమరేజ్ తో కుప్పకూలి కోమాలోకి వెళ్ళిపోయారని వార్తలు వచ్చాయి. ఆయనను హుటాహుటిన చైనా రాజధాని బీజింగ్ కు తరలించారని అక్కడ అత్యవసర చికిత్స చేసినా ఫలించలేదని ఆ వార్తలు పేర్కొన్నాయి. కిమ్ మృతదేహాన్ని మళ్ళీ నార్త్ కొరియాకు తరలించారని, దేశంలో శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా చైనా 9వేల ట్రూప్ ల సైనిక బలగాలను ఉత్తరకొరియాకు పంపిందని వార్తలు వస్తున్నాయి. కాగా, అవన్నీ కట్టుకథలని, కిమ్ నిక్షేపంగా ఉన్నారని షాపింగ్ మాల్ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. అయితే వాటిని ఎప్పుడు తీశారు. ఎక్కడ తీశారు అనే వివరాలేవీ తెలియరాలేదు.

 42ఏళ్ల కిమ్ జోంగ్ 140 కిలోల బరువున్నారు. ఆయన పరిస్థితి బాగాలేదని, నడవడానికి మెట్లు ఎక్కడానికి ఇబ్బందులు పడుతున్నారని దక్షిణ కొరియా గూఢచార సంస్థ పేర్కొంది. ఊబకాయం వల్ల ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆ సంస్థ గతంలో ఒక నివేదికలో వెల్లడించింది. అమెరికాలో స్థిరపడిన చైనా అసమ్మతి నాయకుడు వాన్ జున్ జీ ఆదివారం ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తూ కిమ్ మరణించాడని పేర్కొన్నారు.

Rate this article

How useful or interesting did you find this story?

—Be the first to rate