TELUGU DIRECTOR DEMANDS NITI TAYLOR
పడకగదికి వస్తేనే సినిమా ఛాన్స్ !
తెలుగు దర్శకుడిపై ‘నీతి టేలర్ ’ఆరోపణ
టాలీవుడ్ లో తనకు చేదు అనుభవం ఎదురైందని ప్రముఖ నటి నీతి టేలర్ తెలిపారు. తదుపరి సినిమాలో అవకాశం ఇవ్వాలంటే తనతో గడపాల్సిందేనని ఆ దర్శకుడు తనకు కండిషన్ పెట్టాడని ఆమె ఆరోపించారు. దీంతో తనకేం మాట్లాడాలో తోచక వెంటనే ఫోన్ పెట్టేసి ఆ దర్శకుడి నంబర్ బ్లాక్ చేసిపారేసినట్టు ఆమె ఇటీవల చెప్పారు. నీతి టేలర్ 2012లో ‘‘ మేం వయసుకు వచ్చాం’’ , ‘పెళ్ళిపుస్తకం’, ‘లవ్ డాట్ కామ్’ వంటి సినిమాల్లో నటించారు. నక్కిన త్రినాథరావు, రామకృష్ణ మచ్చకంటి, రాజా వన్నంరెడ్డి ఈ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఒకరోజు తనకు తనకంటే వయసులో ఎంతో పెద్దవాడు, తనతో గతంలో సినిమా చేసిన ఓ దర్శకుని నుండి ఫోన్ వచ్చిందన్నారు. కొత్త సినిమాల్లో హిరోయిన్ గా నటించాలని చెబుతూ, గతంలో వదిలేశానని, ఈ సారి మాత్రం తనతో గడపాల్సి ఉంటుందని ఆ దర్శకుడు నేరుగా అడిగేశాడని, నాకేం చేయాలో బోధపడలేదని నీతి టేలర్ వివరించారు. వెంటనే ఫోన్ కట్ చేసి ఆ కాముకుడి నంబర్ బ్లాక్ చేశానన్నారు. ఇకపై తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించకూడదని, వచ్చినా నటించకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. కాగా, ఆ దర్శకుడు చాలామంది నటీమణులతో కలసి తిరగడం చూశానని, తన వెంట కూడా పడతాడని అనుకోలేదని నీతి టేలర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె టివి సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ‘ ప్యార్ కా బంధన్, ‘ బడే అచ్ఛే లగ్ తే హై -2’ , కైసీ యే యారియా’, సీరియల్స్ ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చి పెట్టాయి. తాజాగా ఆమె ‘అలయెన్స్ ’ అనే రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం , కొందరు దర్శకులపై, నిర్మాతలపై , హీరోలపై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి నీతి టేలర్ ఈ ఆరోపణలు చేశారు.
