TRUMP PLANS OPT FEE 1 Lakh DOLLARS.
విద్యార్థులపై లక్ష డాలర్ల వడ్డనకు ట్రంప్ రెడీ !
- ఒపిటికి 70 వేలు , రెన్యూవల్ కు 30 వేలు.
- అమెరికా ప్రతిపాదన
అమెరికాలో చదువుకుని ఉద్యోగాలు చేద్దామనుకునే విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో పిడుగులాంటి వార్త వినిపించింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆప్టనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఒపిటి) పేర ఏడాదికి 70 వేల డాలర్లు వసూలు చేయాలని, రెన్యూవల్ కు మరో 30 వేలు రాబట్టుకోవాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది.దీనివల్ల విద్యార్థులపై అదనపు భారం పడుతుంది. అయితే ఇది నేరుగా కాకుండా ఆయా యూనివర్సిటీలపై విధించాలని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. ఎలా చూసినా అంతిమంగా విద్యార్థులపైనే ఈ భారం పడుతుంది. ఎఫ్.-1 వీసా కలిగిన విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక ప్రాక్టికల్ ట్రైనింగ్ పేరుతో ఏడాది పాటు అమెరికాలో పనిచేసుకోవడానికి వీలుంది. ఇలాంటి వారు ఆ ఏడాదికి 70 వేల డాలర్లు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం రెన్యూవల్ కు మరో 30 వేల డాలర్లు చెల్లించాలి. వెరసి భారత కరెన్సీలో దాదాపు ఆరున్నర లక్షలవుతుంది. రెన్యూవల్ ను కూడా కలిపితే మరో 3 లక్షల రూపాయలవుతుంది. అంటే మన భారతీయ విద్యార్థులు చదువయ్యాక అక్కడే ఉండి పనిచేసుకోవాలంటే పది లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది వసూలు చేసే బాధ్యతను అక్కడి విద్యాసంస్థలపై మోపితే అవి అదనంగా ఏమైనా వసూలు చేస్తాయా తెలియాల్సి ఉంది.
