Andhra Pradesh

ANIL KAPOOR’S HONEYMOON ?

హనీమూన్ కు ‘ఆమె’ ఒక్కతే వెళ్లింది.!

* బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్

 * 42 ఏళ్ల తర్వాత గుట్టువిప్పిన నటుడు

 ముంబయి ; పెళ్లయిన తర్వాత కొత్త జంట హనీమూన్ కు వెళ్లడం సహజమే. అయితే ఏ ఒక్కరో వెళితే అది వింతే కాదు విడ్డూరం కూడా. కాని ఇది నిజం. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ భార్య సునీత ఒక్కతే హనీమూన్ కు వెళ్లివచ్చింది. ఇదేదో గాసిప్ అనుకునేరు. ఈ సంగతిని అనిల్ కపూరే బయటపెట్టాడు. అదీ పెళ్లయిన 42 ఏళ్ల తర్వాత. ‘‘ఇండియా కే టాప్ వన్ పర్సెంట్ ’’ అనే రియాల్టీ షో లో తోటి కంటెస్టెంట్లకు ఈ సంఘటనను అనిల్ కపూర్ నవ్వుతూ వెల్లడించాడు. తమ పెళ్లయ్యాక హనీమూన్ కు తన భార్య సునీతా కపూర్ ఒక్కతే వెళ్ళిందని, తాను వెళ్లలేదని ప్రముఖ హిందీనటుడు అనిల్ కపూర్ తెలిపారు. 1984లో తమ  వివాహం చాలా సింపుల్ గా జరిగిందన్నారు. కొద్దిమంది స్నేహితులు, కొందరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని, ముచ్చటగా 30 నిమిషాల్లో ఈ తంతు ముగిసిందని అనిల్ చెప్పారు. అయితే  53 సంవత్సరాలుగా ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా తమ మధ్య అన్యోన్యత కొనసాగుతోందని, సునీతాయే తన సర్వస్వమని ఆయన వివరించారు. ఈ జంటకు సోనం కపూర్ తో పాటు, రియా కపూర్. హర్షవర్ధన్ కపూర్ అనే ముగ్గురు పిల్లలున్న సంగతి తెలిసిందే. తాను వంటగదిలోకి వచ్చేది లేదని పెళ్లికి ముందు సునీత ఒక షరతు పెట్టిందని, ఇప్పటిదాకా ఆమె వంటగదిలోకి రానేరాలేదన్నారు. అంతా తానే చూసుకుంటున్నానని అనిల్ తెలిపారు.

Rate this article

How useful or interesting did you find this story?

4.5/5 2 ratings