Gossips

Rakhi Savant BLASTS…

GOVINDA GOVINDA

KOMAL CHUDAIL …PATHI CHOR…

ముంబయిలో ‘ పతిచోర్ ’ !

గోవిందా- కోమల్ చెట్టాపట్టాల్ !

భార్యకు అన్యాయం చేస్తావా భయ్యా ..

రాఖీసావంత్ ఆగ్రహం

 దేశమంతా ఓట్ చోరీపై చర్చ జరుగుతుంటే బాలీవుడ్ లో మాత్రం ‘ పతిచోర్’ అనే టాపిక్ పై హాట్ హాట్ గా  రచ్చరచ్చ అవుతోంది. ప్రముఖ హిందీ నటుడు, మాజీ ఎంపి గోవిందా తన సహనటి కోమల్ రాణితో చెట్టాపట్టాలు వేసుకొని తిరగడమే ఈ చర్చకు కారణం. వీరిద్దరు జంటగా లాల్ బాగ్చా వద్ద కనిపించడంతో అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. గోవిందాకు పెళ్లయి 40 ఏళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ తరఫున ముంబయి నుండి లోక్ సభకు ఎంపికయిన సంగతి తెలిసిందే. తన భార్య సునీతా అహుజాకు అన్యాయం చేస్తూ సినిమాలో తనతో పాటు నటిస్తున్న కోమల్ రాణిని వెంటేసుకుని తిరగడమేంటని పలువురు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కోమల్ ను గోవిందా పెళ్ళి చేసుకుంటాడనే వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ నటీమణులు కశ్మీరా షా, దివ్య ఖోస్లాలు తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

  కాగా, తమ బంధంపై రూమర్లు, విమర్శలు రావడం పట్ల కోమల్ రాణి కూడా ఆగ్రహం వెళ్లగక్కింది. తమ వ్యవహారాల్లో తలదూర్చడానికి వారెవరని ఆమె ప్రశ్నించింది. దీనికి బాలీవుడ్ నటి రాఖీసావంత్ విలేకరుల సమావేశం పెట్టి మరీ అటు గోవిందాను, ఇటు కోమల్ ను కడిగిపారేసింది. ఇతరుల కాపురాల్లో చిచ్చుపెట్టే ‘దయ్యం ’ అని కోమల్ ను దుయ్యబట్టింది. ‘నేను సునీతను కాను, సహనం చూపడానికి దెబ్బకు దెయ్యం వదిలిస్తా…ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తా’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గోవిందా దగ్గర డబ్బులు ఉన్నాయని ఆశతో వచ్చినట్టున్నావు.. , సినిమాలు తీసుకో అంతేగాని కాపురాలు కూల్చకు అని హితవు పలికింది. గోవిందాను తానెంతో అభిమానించానని, ఈవిధంగా చేస్తాడని అనుకోలేదంది. చిన్నప్పటి నుండి అతని సినిమాలు ఎన్నో చూశానని, ఆ డబ్బు రూ.66 వేలయిందని, అదంతా తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. మంచినటుడని అభిమానించి సినిమాలకు డబ్బు ఖర్చు చేస్తే ఇలా పిచ్చివేషాలు వేస్తున్నాడని ‘‘ ఛీ..ఛీ భయ్యా..!‘ అంటూ కామెంట్ చేసింది. అంతేకాక 40 ఏళ్ల వివాహబంధానికి విలువ ఇవ్వకుండా భార్యకు అన్యాయం చేసేవాడు ..నీ కెంతవరకు న్యాయం  చేస్తాడని నేరుగా కోమల్ రాణిని ప్రశ్నించింది. మొత్తానికి గోవిందా,కోమల్ ల వ్యవహారం బాలీవుడ్ అంతా టాంటాం..అయింది.  

Rate this article

How useful or interesting did you find this story?

3.0/5 1 rating