విజయ్ నగదు బహుమతులు
- ఒక్కొక్కరికి 30 లక్షలు.
- విద్యకు 75 లక్షలు. ఇలవేనిల్ కు కోటి
- చెన్నయ్ ; జపాన్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన తమిళనాడు క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ, ముఖ్యమంత్రి విజయ్ నగదు బహుమతులు ప్రకటించారు. కాంస్యపతకాలు సాధించిన వారికి ఒక్కొక్కరికి రూ.30 లక్షల వంతున రాష్ట్రప్రభుత్వం తరఫున అందజేస్తారు. స్క్వాష్ క్రీడలో పతకాలు సాధించిన జోష్న చిన్నప్ప, షమీనా రియాజ్, సెయిలింగ్ లో పతకం సంపాదించిన నేత్ర కుమనన్, వేలవన్ సెంథిల్ కుమార్, అభయ్ సింగ్, అభినయ రాజరాజన్, విశాల్ టికె, రాజేశ్ రమేశ్, బరానికా ఇలంగోవన్ లకు ఈ బహుమతులు అందజేస్తారు. మూడు పతకాలు సంపాదించిన స్ప్రింటర్ విద్యారామరాజ్ కు రూ. 75లక్షల నగదు అందజేస్తారు. బాడ్మింటన్ లో కాంస్యం సాధించిన హరిహరన్ అంసాకరుణన్ కు 30 లక్షలు, భారత జట్టు బంగారు పతకం సాధించిన జట్టులో వికెట్ కీపర్ గా వ్యవహరించిన గుణాలన్ కమలినికి రూ.75 లక్షలు ఇస్తారు. ఇలవేనిల్ వలరివన్ రెండు రజత పతకాలు సాధించినందుకు గుజరాత్ ప్రభుత్వం రూ.1.33 కోట్ల నగదు బహుమతి ప్రకటించగా, తమిళనాడు సర్కార్ కోటిరూపాయల బహుమతి ప్రకటించింది.
