Andhra Pradesh

Congress Changed its Caliculations in UP.

Appoints Brahman WOMAN as PCC President,

A Muslim as Working President. AICC incharge A Dalith

 ‘ నమో ’ హవాకు మోనా తో చెక్ !

  • యుపిలో ‘ హస్త ’ విన్యాసం
  • అన్ని అస్త్రాలకు కాంగ్రెస్ పదును
  • పిసిసిలో సమూల మార్పులు

లక్నో ; దేశానికి గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్ లో బిజెపిని దెబ్బతీస్తేనే కేంద్రంలో , రాష్ట్రంలో నాలుగోసారి ఆ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా అనేక వ్యూహాలు రచిస్తోంది. యుపిలో సిఎం యోగి ఆదిత్యనాథ్ హవాకు బ్రేక్ వేయడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీకి చెక్ పెట్టడానికి పావులు కదిపింది. ఇందులో భాగంగా యుపిలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్ వాది పార్టీ (ఎస్.పి)తో సామరస్యంగా పొత్తులు కుదుర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా అనేక మార్పులు చేసింది. పిసిసి అధ్యక్షురాలిగా ఓ మహిళను, అదీ  బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయకురాలిని నియమించింది. దీంతో అటు మహిళల ఓటు బ్యాంకును, ఇటు బ్రాహ్మణ వర్గపు ఓటర్లను మచ్చిక చేసుకున్నట్టయింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆరాధనా మిశ్రా అలియాస్ మోనా మిశ్రాకు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. ఈమె కాంగ్రెస్ సీనియర్ ఎంపీ ప్రమోద్ తివారీ కూతురు. అంతేగాక సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తో ఆమెకు సత్సంబంధాలున్నాయి. ఇది సీట్ల సర్దుబాటు సాఫీగా సాగడానికి దోహదపడుతుంది.

      ఇక పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ ను, సీనియర్ ఉపాధ్యక్షులుగా దేవీందర్ నిషాద్, అలోక్ ప్రసాద్ లను నియమించింది. అలాగే చౌదరీ వీరేంద్ర సింగ్ ను సిఎల్ పి నాయకుడిగా నియమించింది. సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జ్ గా దళితుడైన రాజేందర్ పాల్ గౌతమ్ వ్యవహరిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ పిసిసిని ప్రక్షాళన చేసింది.  2024 పార్లమెంట్ ఎన్నికల్లో యుపిలోని 80 సీట్లకు గాను తమ ఇండియా కూటమి 43 సీట్లు గెలుచుకుందని మోనా మిశ్రా తెలిపారు. రాష్ట్రంలో బిజెపిని నాలుగోపర్యాయం 2027లో గెలవనియ్యబోమని ఆమె చెప్పారు. కులమతరాజకీయాలు తామెన్నడూ చేయలేదని, దేశసంక్షేమమే తమ ధ్యేయమని ఆమె అన్నారు.

         ………………………………………..   

Rate this article

How useful or interesting did you find this story?

4.5/5 2 ratings