Andhra Pradesh

NEW DEVICE IN 6 COLOURS.

OBSERVES BRAIN FUNCTIONING

 ఆరురంగుల్లో ‘ టెంపుల్ ’

 -ధర రూ. లక్ష దాకా !

– మెదడు పనితీరుపై నిఘా …

మన మెదడుకు రక్తప్రసరణ ఎలా జరుగుతోంది, సరైన మోతాదులో ఆక్సిజన్ అందుతుందా లేదా నిరంతరం తెలిపే ఆధునిక పరికరం త్వరలో మార్కెట్లోకి వస్తోంది. ఈ అత్యాధునిక పరికరానికి త్వరలో  బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. జొమాటో వ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్ ఈ నయా వస్తువును మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దీన్ని మనం నుదుటికి చెవికి మధ్య భాగంలో కణతల వద్ద అమర్చుకోవచ్చు అందుకే దీనికి ‘టెంపుల్’ అని పేరు పెట్టారు. దీన్ని మనం అమర్చుకోగానే మన మెదడు పనితీరును అనుక్షణం గమనిస్తూ   సిగ్నల్స్ ద్వారా డివైస్ కు వెంటవెంటనే సమాచారం చేరవేస్తుంది. దీంతో వైద్యులకు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని ధర వెయ్యిడాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో సుమారు లక్ష రూపాయల దాకా ఉంటుందని దీపీందర్ తన ఎక్స్ ఖాతాలో వివరించారు.

     ఈ పరికరాన్ని బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు ఇప్పటికే ధరిస్తున్నారు. వచ్చేవారం బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు దీపీందర్ గోయల్ తెలిపారు. రెండునెలల్లోగా దీన్ని వినియోగదారులకు అందజేస్తామని ఆయన చెప్పారు.  

Rate this article

How useful or interesting did you find this story?

3.7/5 3 ratings