జీ5, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ …ఇంకా మరిన్ని ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ లో ఈ వారాంతం నుంచి స్ట్రీమింగ్ కి సిద్ధమైన తాజా సినిమాలు, షోలతో వాచ్ లిస్టు సరికొత్తగా అప్ డేట్ అయింది. ఇందులో లోకేష్ కనగరాజ్, వామికా గబ్బీ నటించిన తమిళ క్రైమ్ డ్రామా ‘డీసీ’, కరణ్ జోహార్ సెలబ్రిటీ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్ ‘ తొమ్మిదవ / చివరి సీజన్ లనుంచీ, ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ రూపొందించిన, ఎమిలీ బ్లంట్ నటించిన, సై ఫై థ్రిల్లర్ ‘డిస్ క్లోజర్ డే’ వరకూ మొత్తం 13 సినిమాలు, షోలు ఈ వీకెండ్ వినోదానికి (అక్టోబర్ 17) ఓటీటీ ప్రేక్షకుల ముందు కొచ్చేశాయి. వీటి పూర్తి వివరాలు ఈ కింద చూద్దాం…
1. డీసీ – సోనీలివ్
లోకేష్ కనగరాజ్ దేవదాసుగా నటించిన ‘ డీసీ‘, ఒక దోపిడీలో పోలీస్ అధికారి మరణం తర్వాత పారిపోతున్న తిరుగుబాటుదారుడైన నేరస్థుడి కథ చెబుతుంది. అతను చంద్ర (వామికా గబ్బి) అనే సెక్స్ వర్కర్‌తో జతకడతాడు. అతడికామె చీకటిమయమైన నేర ప్రపంచంలోకి ప్రవేశించ
డానికి సహాయపడుతుంది. ఈ తమిళ క్రైమ్ డ్రామా, శరత్ చంద్ర ఛటోపాధ్యాయ క్లాసిక్ నవల ‘ దేవదాస్‘కి వాస్తవిక పునఃకల్పన.
2. కాఫీ విత్ కరణ్, సీజన్ 9 – జియో హాట్‌స్టార్
‘కాఫీ విత్ కరణ్’ –ఈ తొమ్మిదవ / చివరి సీజన్ లో సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్ లు అతిథులుగా హాజరవుతారు. బాలీవుడ్ తారలు తమ జీవితాల గురించి, కెరీర్ల గురించీ మనసు విప్పి మాట్లాడే నిష్కపట సంభాషణలు, సెలబ్రిటీల కబుర్లూ, సరదా ముచ్చట్లూ ఈ షోలో ఎంజాయ్ చేయవచ్చు.
3. ది డిప్లొమాట్ సీజన్ 4 – నెట్‌ఫ్లిక్స్
‘ది డిప్లొమాట్‘ సీజన్ 4లో , రాయబారి కేట్ వైలర్ (కేరీ రస్సెల్) దొంగిలించిన రష్యన్ అణు ఆయుధానికి సంబంధించిన భౌగోళిక రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఉపాధ్యక్షుడు హాల్ వైలర్ (రూఫస్ సెవెల్) ఒక రాజకీయ కుట్రలో చిక్కుకోవడంతో, ఒక పెద్ద సంఘర్షణని నివారించడానికి కేట్ ఒక ప్రమాదకర, అధికార పోరాటాన్ని చాకచక్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.
4. డిస్ క్లోజర్ డే – జియోహాట్‌స్టార్
స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహించిన ‘డిస్ క్లోజర్ డే’ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. గ్రహాంతర జీవుల ఉనికికి సంబంధించిన రహస్య ఆధారాల్ని కనుగొన్న డాక్టర్ డేనియల్ కెల్నర్ (జోష్ ఓ‘కానర్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. టెలిపతిక్ శక్తులు గల వాతావరణ శాస్త్రవేత్త మార్గరెట్ ఫెయిర్‌చైల్డ్ (ఎమిలీ బ్లంట్) సహాయంతో, ఆ నిజం ప్రపంచ సంఘర్షణకి దారితీయక ముందే దాన్ని బహిర్గతం చేయడానికి అతను బయలుదేరతాడు.
Bottom of Form
5. ది స్టార్మ్ – నెట్‌ఫ్లిక్స్
ఉత్తర స్వీడన్‌లోని ఒక మారుమూల ఎస్టేట్‌లో ఫిలిప్ (గుస్తాఫ్ స్కార్స్‌గార్డ్) జరుపుకుంటున్న 45వ పుట్టినరోజు వేడుక, ఒక భయంకర తుఫాను కారణంగా అతిథులందరూ ఒకేచోట చిక్కుకుపోవడంతో ఒక అశుభకర మలుపు తీసుకుంటుంది. ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ, పాతిపెట్టిన రహస్యాలు, పాత పగలూ ప్రేమ ద్రోహాలూ ఆ వేడుకని విచ్ఛిన్నం చేసేలా మారుతాయి.
6. లవ్ ఆఫ్ యువర్ లైఫ్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
రాచెల్ మోరిసన్ దర్శకత్వం వహించిన ‘ లవ్ ఆఫ్ యువర్ లైఫ్‘ మూవీ, భర్త చార్లీ (గాబ్రియేల్ బాసో) మరణం తర్వాత లిస్బన్‌కి ప్రయాణించిన బోస్టన్ నర్సు మాయ (మార్గరెట్ క్వాలీ) ప్రయాణాన్ని అన్వేషిస్తుంది. ఆమె తన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తోటి ప్రవాసి (ఆరోన్ పియెర్)తో ఏర్పడిన పరిచయం ఆమెని తన దుఃఖాన్ని, గతాన్ని ఎదుర్కోవలసి వచ్చేలా చేస్తుంది.
7. శాక్రిఫైస్ – లయన్స్ గేట్ ప్లే
ఈ వ్యంగ్యాత్మక పర్యావరణ థ్రిల్లర్‌లో గ్రీకు ద్వీపంలో ఒక బిలియనీర్ (విన్సెంట్ కాసెల్), అతడి పాప్-స్టార్ భార్య (సల్మా హాయెక్) నిర్వహించిన ఛారిటీ గాలాలో, జోన్ (అన్యా టేలర్-జాయ్) నాయకత్వంలోని ఒక తీవ్రవాద మిలిటెంట్ సమూహం అతిథుల్ని బందీలుగా పట్టుకోవ
డాన్నిచూపిస్తుంది. బందీలుగా ఉన్నవారిలో ఒక సినిమా స్టార్ (క్రిస్ ఎవాన్స్) కూడా ఉండడంతో, ప్రపంచ వినాశనాన్ని నివారించడానికి ఆ సమూహం నరబలికి ప్రణాళిక వేస్తుంది. ఇది మనుగడ కోసం ఒక గందరగోళ పోరాటాన్ని ప్రేరేపిస్తుంది.
8. ది ట్రాప్ – నెట్‌ఫ్లిక్స్
మెలనీ రాబే రాసిన అత్యధికంగా అమ్ముడైన నవల ఆధారంగా రూపొందించిన ‘ది ట్రాప్‘ ఆరు భాగాల జర్మన్ సైకలాజికల్ థ్రిల్లర్. ఇది ఏకాంతంగా జీవించే రచయిత్రి లీసా కొన్రాడ్ (ఫ్రైడెరికే బెక్ట్) జీవితంలోకి లోతుగా వెళుతుంది. ఆమె తన సోదరి హత్య జరిగిన చాలా సంవత్సరాల తర్వాత టెలివిజన్‌లో అనుమానిత హంతకుడిని చూస్తుంది. అతడిని ఒక ఉచ్చులోకి లాగడానికి తన తర్వాతి నవలని ఉపయోగించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఇది ఉత్కంఠభరిత పిల్లీ- ఎలుకా ఆటగా అలరిస్తుంది.
9. హాలీవుడ్ ఆర్ట్స్ – నెట్‌ఫ్లిక్స్
‘హాలీవుడ్ ఆర్ట్స్’ లో , నటి ట్రినా వేగా (డానియెల్లా మోనెట్) అర్హత లేకపోయినప్పటికీ, తన పాత ఉన్నత పాఠశాలకి ప్రత్యామ్నాయ ఉపాధ్యాయురాలిగా తిరిగి వస్తుంది. తన విద్యార్థుల ప్రసిద్ధ తల్లిదండ్రులను ఉపయోగించుకుని, తన కెరీర్లో ముందుకు సాగాలని ఆశిస్తూ, ఆమె అనుకోకుండా కొత్త తరం కళాకారులకి స్ఫూర్తినివ్వడం ఈ కథ.
10. మాస్టర్‌ప్లాన్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ క్రైమ్ కామెడీ, రిటైర్ అయిన ప్రఖ్యాత దొంగ రోజర్ (స్టాన్లీ టూచీ) జీవితాన్ని అన్వేషిస్తుంది. అతను మోనాలిసాని దొంగిలించడానికి ఒక ఇటాలియన్ హ్యాకర్ (సిమోనా టబాస్కో) ని, ఒక ఫ్రెంచ్ పేలుడు పదార్థాల నిపుణుడు (విక్టర్ బెల్మోండో)నీ నియమించుకుంటాడు. నియమించుకున్న ఆ ఇద్దరూ చాలా కాలం క్రితం విడిపోయిన తోబుట్టువులనీ, తన కన్న పిల్లలేననీ వెల్లడైనప్పుడు, ఈ దోపిడీ పథకం ఊహించని మలుపు తీసుకుంటుంది.
11. మనీ ట్రాప్: ది కరూన్ ట్రెజర్ – నెట్‌ఫ్లిక్స్
కరూన్ నిధికి దారితీసే ఒక పౌరాణిక పటాన్ని సంపాదించిన తర్వాత, మోసగాడు అసిమ్ నోయాన్ (యిల్మాజ్ ఎర్డోగాన్) చివరి మోసం కోసం తన పాత ముఠాని తిరిగి కలుపుతాడు. ప్రత్యర్థి ముఠాలు, అంతర్జాతీయ నిధి వేటగాళ్ళూ ఈ వేటలోకి ప్రవేశించడంతో, ఈ ప్రణాళిక త్వరగా గందరగోళంగా మారుతుంది.
12. ఆశా – జీ5
ఈ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్‌లో, ఒక చిన్న కారు ప్రమాదం తర్వాత జీవితం అదుపు తప్పిన, మానసికంగా కుంగిపోయిన వితంతువు పాత్రలో ఊర్వశి నటించింది. ఉద్రేకపూరిత స్వభావం గల జీమన్ (జోజు జార్జ్) అనే వ్యక్తితో ఆమెకు ఏర్పడిన వాగ్వాదం, ఒక సాధారణ ట్రాఫిక్ వివాదాన్ని భయంకరమైన, తీవ్రమవుతున్న పీడకలగా మారుస్తుంది.
13. టైసన్ – నెట్‌ఫ్లిక్స్
ఈ నాలుగు భాగాల డాక్యూమెంటరీలో, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కల్లోలభరిత జీవితాన్ని, కెరీర్‌ని, బ్రూక్లిన్‌లోని అతడి సమస్యాత్మక బాల్యం నుంచీచరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన హెవీవెయిట్ ఛాంపియన్‌గా అవతరించడం వరకూ వివరిస్తుంది. ఇది వ్యసనం, జైలు జీవితం, వివాదాలతో కూడిన అతడి పోరాటాల్ని, అలాగే అతను విముక్తి వైపు పయనించిన మార్గాన్నీ అన్వేషిస్తుంది.
