నవంబర్ 11 న గ్రీస్ లో , 21న చెన్నయ్ లో రిసెప్షన్
చెన్నయి ; ప్రముఖ నిర్మాత , సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె కావ్యమారన్ వివాహం ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రతో జరుగనుంది. వచ్చేనెల 11న గ్రీస్ లో పెళ్లి , 21న చెన్నయ్ లో రిసెప్షన్ జరుగుతుంది. తమ కుమార్తె వివాహానికి రావాలని కళానిధి మారన్, కావేరీ మారన్ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలసి ఆహ్వానించారు. సిఎం రేవంత్ దంపతులు వారిని సాదరంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు. ఐపిఎల్ సన్ రైజర్స్ యాజమాని అయిన కావ్యమారన్, సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళనటుడు వైజీ మహేంద్ర కుమారుడైన అనిరుధ్ లియో, ఇండియన్ 2,కూలీ తదిర భారీ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కావ్య,అనిరుధ్ లు ఇద్దరు చాలాకాలంగా మంచి స్నేహితులుగా ఉన్నారు. వారిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు గత ఏడాది నుంచే వస్తున్నాయి. ఇన్నాళ్లకు వారికి ముహూర్తం కుదిరింది.
