ఒక నటుడు విజయవంతం అవ్వడం చిత్ర కధ మీద, ఆ దర్శకుడి పని తీరుమీద, ఆ చిత్ర హీరో ప్రతిభ మీదే కాకుండా ఆ హీరో అదృష్టం మీద కూడా ఆధారపడివుంటుంది.
విజయదేవరకొండ ప్రతిభకి అదృష్టం కూడా తోడై సూపర్ హీరో అయ్యాడు.
ఇలాంటి సమయంలో ఏ హీరో కెరియర్ అయినా సరైనమార్గంలో పెట్టడానికి ఒక గైడ్,
ఒక గాడ్ ఫాదర్, ఒక శ్రేయోభిలాషి ఎవరో ఒకరు అవసరం. ఇక్కడ ఇది లేకపోవడం వల్లే
ఈ హీరో కెరియర్ గాడి తప్పింది.
ఎంతవేగంగా పరుగెత్తే గుర్రాన్నైనా కంట్రోల్ చేయడానికి రధసారధి కావాలి.
అది చిరంజీవికి, అల్లుఅర్జున్ కి- అరవింద్, వెంకటేష్ కి -సురేష్ బాబు, రాంచరణ్ కి -చిరంజీవి రూపంలో అనేకమంది హీరోలకి అనేక వ్యక్తుల రూపంలో కనిపిస్తుంది.
విజయ్ మాట్లాడే తీరు అతనికి కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది, చూసినవాళ్ళకి ఆ తీరు అహంకారంగా కనిపిస్తుంది. ఇక విజయ్ కాస్ట్యూమ్స్ తీరు జనానికి మరింత దూరం చేసింది
వెరసి ఇతని మీద వ్యతిరేకభావం ప్రేక్షకుల్లో కలిగింది. లేకపోతే ఎంతో క్రేజ్ ఉన్న ఈ హీరోకి రేపటి ఓపెనింగ్స్ కి సంబంధమే లేదు. ఓపెనింగ్స్ లాగే ప్రేక్షకులకి ఇతనికి కూడా బంధం సన్నగిల్లింది అనేది క్లియర్గా ఈరోజు టికెట్ బుకింగ్స్ లో కనిపిస్తోంది.
ప్రేక్షకులు నటుడికి నీరాజనం పలుకుతున్నప్పుడు హీరోలు వారికి మరింత దగ్గరై
ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలి.
అలా ప్రేక్షకులకి దగ్గరవ్వడంలో ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి పెద్ద హీరోలకి తెలిసినట్టు ఈకాలం విజయ్ లాంటి కుర్రహీరోలకి తెలియకపోవడమే ఇలాంటి పరిస్థితులకు కారణం.
